6 ప్యాక్: ఎన్టీఆర్ ‘టెంపర్’ ఫస్ట్ లుక్ లీక్ (ఫోటోస్)
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, డైరక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో నిర్మాత బండ్ల గణే ష్ నిర్మిస్తున్న చిత్రానికి ‘టెంపర్' అనే టైటిల్ ఫైనలైజ్ చేసిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ తన సినిమాలో హీరోలను భిన్నంగా, తనదైన మార్కు కనిపించేలా స్టైలిష్‌గా చూపిస్తారు. తాజాగా ‘టెంపర్' చిత్రంలో తనదైన మార్కుతో జూ ఎన్టీఆర్‌ను ప్రజంట్ చేసాడు పూరి. తాజాగా ఇంటర్నెట్లో లీకైన జూ ఎన్టీఆర్ ఫోటోలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఈ ఫోటోలు చూస్తుంటే....జూ ఎన్టీఆర్ బాగా జిమ్ చేసి బాడీ బిల్డ్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. వాస్తవానికి ఈ చిత్రం ఫస్ట్ లుక్ నవంబర్ 29న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమచారం. అయితే అంతకంటే ముందుగానే ఫోటోలు బయటకు లీక్ కావడం గమనార్హం.
స్లైడ్ షోలో జూ ఎన్టీఆర్ ‘టెంపర్' మూవీ లీక్డ్ ఫోటోస్....

ఫస్ట్ లుక్ ప్లానింగ్ ఇలా...
టెంపర్ పోస్టర్స్ ఆరు డిజైన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ఎన్టీఆర్ తుపాకి పట్టుకున్నది, మరొకటి సీరియస్ గా చూస్తున్నది, వేరొకటి గోవా బోచ్ లో కూర్చుని ఉన్నది, కాజల్ తో రొమాన్స్ చేసేది ఇలా ఆరు రకాలుగా డిజైన్ చేసి ఫస్ట్ లుక్ ని వదులుతున్నట్లు సమాచారం.

వెరీ వెరీ స్పెషల్
ఎన్టీఆర్ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో చేసినప్పటికి ఇది స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. మరో ప్రక్క డిసెంబర్ 1 వ తేదీన టెంపర్ టీజర్ విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ ఈ మేరకు ఆ వీడియో ఎడిటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.

జూ ఎన్టీఆర్
పూరి సినిమాలంటేనే షెడ్యూల్ ప్రకారం పర్ ఫెక్టుగా జరుగుతాయి. తాజాగా ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పోలీసాఫీసర్ పాత్రలో కనపడబోతున్నారు.

యాక్షన్ ఎంటర్టెనర్
యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు.

ఇతర వివరాలు
కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











