జూ ఎన్టీఆర్ కల్యాణ వేదికకు సర్వాంగ సుందరంగా తుదిమెరుగులు...!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లి పనులు మరింత ఊపందుకున్నాయి. ఈనెల 5వ తెదే రాత్రి 2.41 నిమిషాలకు యన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరపడానికి హైదరాబాదు, మాదాపూర్ లోని హైటెక్స్ లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లి మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కళ్యాణ వేదిక పనులును సి.సి.కెమారాస్ ద్వారా ఎన్టీఆర్ తన ఇంటి నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ఈ మండపాన్ని రూపొందిస్తున్నారు. దీనికోసం దాదాపు 300 మంది వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. వేదిక ఒకటి రెండు రోజుల్లో రెడీ అయిపోతుందని చెబుతున్నారు. ఈ కళ్యాణ వేదికకు సంబంధించిన వివరాలను కవర్ చేయడానికి టీవీ చానళ్ళు పోటీపడుతున్నాయి. అయితే, నిర్వాహకులు అందుకు అనుమతించడం లేదు..


Click it and Unblock the Notifications











