»   » ఒక్క ఫోటో.. దడదడలాడించిన ఎన్టీఆర్: కానీ అది మాత్రం పెద్ద సస్పెన్స్?

ఒక్క ఫోటో.. దడదడలాడించిన ఎన్టీఆర్: కానీ అది మాత్రం పెద్ద సస్పెన్స్?

Subscribe to Filmibeat Telugu
ఎన్టీఆర్ ఫోటో వైర‌ల్‌ : 'బీస్టిన్'(ఎక్కువగా శిక్షించేవాడు) అని ట్వీట్ చేసిన బాలీవుడ్ హీరో

హైదరాబాద్: తెర మీద పాత్రకు న్యాయం చేయాలంటే.. తెర వెనుక దానికోసం చాలానే కష్టపడాల్సి ఉంటుంది. ఆహార్యం దగ్గరి నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతీది కొత్తగా కనిపించాలంటే కసరత్తులకు పదును పెట్టాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడదే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఎంతలా కష్టపడుతున్నాడో చెప్పేందుకు నెట్‌లో వైరల్ అవుతున్న ఓ ఫోటోనే ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు. అయితే ఈ కష్టమంతా రాజమౌళి కోసమా?.. లేక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా కోసమా? అన్నది పెద్ద సస్పెన్స్.

 జిమ్‌లో కసరత్తులు..:

జిమ్‌లో కసరత్తులు..:

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కోసం పూర్తిగా కొత్త గెటప్ లో కనిపించనున్న తారక్.. అందుకోసం బాడీ ఫిట్‌నెస్‌పై ఫుల్లుగా ఫోకస్ చేశాడు. హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో బాడీ రూపు రేఖలు మార్చేలా వర్కౌట్స్ చేస్తున్నాడు.

 కండలు తిరిగిన దేహం..:

కండలు తిరిగిన దేహం..:

ఫిట్‌నెస్ కసరత్తుల్లో భాగంగా తారక్ చేస్తున్న వర్కౌట్స్ కు సంబంధించి తాజాగా ఓ ఫోటో బయటకు లీక్ అయింది. కండలు తిరిగిన దేహంతో ఫోటోలో ఎన్టీఆర్ కనిపిస్తున్న తీరు జిమ్‌లో ఆయన ఎంతలా కష్టపడుతున్నారో చెప్పకనే చెబుతోంది.

 స్టీవెన్స్ పర్యవేక్షణలో:

స్టీవెన్స్ పర్యవేక్షణలో:

నిజానికి టెంపర్ సినిమాలోనూ ఎన్టీఆర్ మజిల్ బాడీతో కనిపించినప్పటికీ.. ఈ సినిమాలో మరింత భిన్నంగా కనిపించబోతున్నాడని టాక్. ఇందుకోసం స్టీవెన్స్ నుంచి విలువైన సలహాలు-సూచనలు స్వీకరిస్తూ జిమ్‌లో ఎక్కువసేపు చెమటోడుస్తున్నాడట.

 రణ్‌వీర్ స్పందన..:

రణ్‌వీర్ స్పందన..:

యాంకర్ కత్తి కార్తీక ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న ఫోటోను షేర్ చేయడంతో.. క్షణాల్లో అది వైర‌ల్‌గా మారిపోయింది. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ సైతం ఈ ఫోటోపై స్పందించారు. జిమ్ ట్రైనర్‌గా స్టీవెన్ ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో చెబుతూ.. 'బీస్టిన్'(ఎక్కువగా శిక్షించేవాడు) అని ట్వీట్ చేశారు. రణ్‌వీర్ ట్వీట్ పట్ల సరదాగా స్పందించిన స్టీవెన్.. 'నీకు తెలుసు బ్రో' అంటూ కామెంట్ చేయడం విశేషం.

రాజమౌళి సినిమా కోసమేనా?:

రాజమౌళి సినిమా కోసమేనా?:

ఎన్టీఆర్ జిమ్ కసరత్తులు చూస్తుంటే.. రాజమౌళి సినిమా కోసమే ఆయన ఇంతలా కష్టపడుతున్నారా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు. రాంచరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి తీయబోయే సినిమాపై అధికారికంగా ప్రకటన లేకపోయినప్పటికీ.. అంతర్గతంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇప్పటికీ మొదలైపోయిందనేది కొంతమంది వాదన. రాజమౌళి తెరకెక్కించబోయే ఆ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టే.. ఎన్టీఆర్ ఇంతలా కష్టపడుతున్నారని అంటున్నారు.

 త్రివిక్రమ్‌తో సినిమా..:

త్రివిక్రమ్‌తో సినిమా..:

నిజానికి అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తాడా? అని చాలామంది అనుమానించారు. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో మూవీకి 'సై' అన్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తారక్‌ సరసన పూజా హెగ్డే నటించనున్నారు. ఓవైపు ఈ సినిమా చేస్తూనే.. మరోవైపు రాజమౌళి తెరకెక్కించబోయే సినిమా షూటింగ్ లోనూ ఎన్టీఆర్ పాల్గొంటారని వినికిడి.

English summary
'The shooting of SS Rajamouli's upcoming film with Telugu superstars Jr.NTR and Ram Charan is yet to be begin, but the film is creating headlines with each passing day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu