జూ ఎన్టీఆర్ ‘మాఫియా’ వలలో మళ్లీ మాయ లేడీ...!?
'ఏ మాయ చేశావె" చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సమంత ఆ తర్వాత జూ ఎన్టీఆర్ తో బృందావనం" చిత్రంలో నటించింది. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న మహేష్ 'దూకుడు"లో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే జూ ఎన్టీార్ హీరోగా తను దర్శకత్వం వహించబోతున్న చిత్రకథను సమంతకు చెప్పి...ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని కోరాడట శ్రీనువైట్ల. జూ ఎన్టీఆర్ అంటే సమంత కాదంటుందా? వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వినికిడి..ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం.
'మాఫియా" అంటే నిజంగా అండర్ వరల్డ్ అనుకునేరు..ఈ మాఫియా ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ అయిన ఓ కొత్త టైటిల్. పరమేషశ్వర ఆర్ట్స్ పతాకంపై మాఫియా ఒక మంచి కుటుంబ కథా చిత్రం అనే టైటిల్ తో రిజిష్టర్ అయింది. గణేష్ బాబు నిర్మాణంలో, శ్రీనువైట్ల-ఎన్టీఆర్ కలయికలో ఒక చిత్రం రానుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే..ఈ టైటిల్ ని బట్టి ఇది శ్రీనువైట్ల సినిమా కావడానికి స్కోపెక్కువ ఉండడంతో ఇదే ఎన్టీఆర్, వైట్ల సినిమా టైటిలంటూ ప్రచారం జరిగిపోతోంది.
కాగా మహేష్ తో దూకుడులాంటి యాక్షన్ సినిమా తీస్తున్న శ్రీనువైట్ల జూ ఎన్టీఆర్ తో మాత్రం మాస్ సినిమా కాకుండా ఫ్యామిలీ సినిమా తీస్తాడా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ వరుసగా మంచి డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ సేఫ్ జోన్ లో ఉంటున్నాడు. సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను, సినిమాల తర్వాత శ్రీను వైట్ల, త్రివిక్రమ్ తో అతను పనిచేయనున్నాడు.


Click it and Unblock the Notifications











