నా కుటుంబ సభ్యుడులాంటి నిర్మాత...ఎన్టీఆర్
నా కుటుంబ సభ్యుడులాంటి నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రంతో మరో విజయాన్ని అందుకోవాలి' అన్నారు ఎన్టీఆర్. రామ్, ప్రియా ఆనంద్, బిందుమాధవి హీరో,హీరోయిన్స్ గా శ్రీవాస్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన చిత్రం 'రామ రామ.. కృష్ణ కృష్ణ'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ పై విధంగా స్పందించారు. అలాగే హీరో రామ్ గురించి మాట్లాడుతూ..."రామ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనిలో మంచి ఎనర్జీ వుంది. కీరవాణి 200 చిత్రాలు పూర్తిచేయడం ఆనందంగా వుంది. అందులో నా సినిమాలు మూడు ఉన్నాయి. అవి మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌గా నిలిచాయి. ఆయన మరో రెండొందల సినిమాలు పూర్తిచేయాలి. ఈ ఆడియోతో పాటు చిత్రం కూడా విజయం సాధించాలి అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి అందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అలాగే ఎన్టీఆర్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న బృందావనం చిత్రంలో హీరోగా చేస్తున్నారు. మున్నా దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో సమంతా, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











