twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా అమ్మ, మా ఆవిడా అంతే... నేను చాలా హైపర్: ఎన్టీఆర్

    బిగ్ బాస్ సీజన్ 1 విజయవంతంగా ముగిసింది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 2 మొదలు కానుంది. సెకండ్ సీజన్ కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నారు.ఈ విషయాన్ని స్టార్ మాటీవీ వారు ఖరారు చేశారు.

    By Bojja Kumar
    |

    'బిగ్ బాస్' రియాల్టీ షో ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టిన ఎన్టీఆర్.... తొలి ప్రయత్నంలోనే ది బెస్ట్ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేసిన తీరు చూసిన తర్వాత దీన్ని తారక్ తప్ప మరెవ్వరూ ఇంత బాగా హ్యాండిల్ చేయలేరు అనే నిర్ణయానికి వచ్చారు.

    బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయిన నేపథ్యంలో..... వీలైనంత త్వరగా బాస్ సీజన్ 2 కూడా మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది ప్రారంభం కావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని అంచనా.

    బిగ్ బాస్ 2

    బిగ్ బాస్ 2

    బిగ్ బాస్ మొదటి సీజన్ ముగిసింది. శివ బాలాజీ విజేతగా నిలిచాడు. మరి రెండవ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? దీన్ని కూడా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారా? లేక మరెవరైనా వస్తారా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.

    Recommended Video

    Jai Lava Kusa will cross Rs 100crore mark over the weekend
    అఫీషియల్

    అఫీషియల్

    అభిమానుల్లో నెలకొన్న ఈ సందేహాలను తీరుస్తూ.... మాటీవీ అఫీషియల్ గా ప్రకటించింది. ఛాలెంజింగ్ గా తీసుకుని చేసిన ‘బిగ్ బాస్ తెలుగు' బాగా ఎంజాయ్ చేశానని, ఇందుకు గాను స్టార్ మా ఛానల్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇక నుండి ‘నా టీవీ'ని మిస్ అవుతున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేయగా, స్టార్ మాటీవీ వారు వెంటనే స్పందించారు. తారక్ కు థాంక్స్ చెప్తూ... బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 కోసం మళ్లీ కలుద్దాం, మళ్ళీ కలిసి పనిచేద్దాం' అంటూ.... ట్వీట్ చేశారు.

    తారక్ ఎక్కడికెళ్లినా బిగ్ బాస్ గురించే

    తారక్ ఎక్కడికెళ్లినా బిగ్ బాస్ గురించే

    ఎన్టీఆర్ బిగ్ బాస్ షో హోస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన ఎక్కడికెళ్లినా ఈ షో గురించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తన జై లవ కుశ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్లినా, లేదా ఇతర వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కార్యక్రమాలకు వెళ్లినా అసందర్భంగా బిగ్ బాస్ గురించి అడుగుతున్నా..... తారక్ ఏమాత్రం నొచ్చుకోకుండా సమాధానాలు ఇస్తున్నారు.

    మా అమ్మతో పాటు మా ఆవిడ కూడా అలాగే...

    మా అమ్మతో పాటు మా ఆవిడ కూడా అలాగే...

    ఇటీవల ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ కు మీడియా ప్రతినిధుల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మీ అమ్మగారికి బిగ్‌బాస్ షోలో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?' అని అడగ్గా ఎన్టీఆర్ సమాధానమిస్తూ... ‘మా అమ్మకు నన్ను దాటి చూపు ఎక్కడికి వెళ్లదు', ‘మా అమ్మే అనుకుంటే మా ఆవిడ కూడా అలాగే తయారైంది', తన జీవితంలో ఇలాంటి ఇద్దరు మహిళలు ఉండటం తన అదృష్టమని ఎన్టీఆర్ చెప్పారు.

    యాంకర్ పొగడ్తలు

    యాంకర్ పొగడ్తలు

    ఇటీవల జై లవ కుశ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ... అటు జై లవ కుశలో మూడు పాత్రలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఇటు బిగ్ బాస్ షో విజయవంతంగా హోస్ట్ చేశారని, మీరు తెలుగు బుల్లితెర ఖ్యాతిని మరో లెవల్‌కి తీసుకెళ్లారు, అదే సమయంలో పెద్ద హిట్ ఇచ్చారు అంటూ పొగడ్తలు గుప్పించింది. దీనికి వెంటనే ఎన్టీఆర్ స్పందిస్తూ ఏవండీ మన షోను మనం పొగుడుకోకూడదు అంటూ జోక్ చేశారు.

    నేను చాలా హైపర్

    నేను చాలా హైపర్

    ‘నేను చాలా హైపర్, నాకు హైపర్‌నెస్ లేకుంటే కట్టడి చేసేసినట్లు అవుతుంది. ఒక్కోసారి హైపర్ నెస్ తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. బిగ్ బాస్ లాంటి షోకు నా హైపర్ నెస్ కావాల్సి వచ్చింది, ఒరిజినల్‌గా నేను ఎలా ఉంటానో చూపించాల్సి వచ్చింది. ప్రతి వారం అక్కడికి వెళ్లినపుడు మై సెల్ఫ్ రిమెంబర్ చేసుకున్నాను' అని ఎన్టీఆర్ అన్నారు.

    నాకు వెరైటీ సిద్ధాంతం ఉంది

    నాకు వెరైటీ సిద్ధాంతం ఉంది

    మిమ్మల్ని మీరు ప్రతి రోజూ ఎలా ఇన్‌స్పైర్ చేసుకుంటారు అని ప్రశ్నించగా..... నాకు వెరైటీ సిద్ధంతం ఒకటి ఉంది. అద్దం ముందు నగ్నంగా నిల్చుని మీ ఒంటిపై గీతలు గుర్తించి, యాక్సెప్ట్ చేసినట్లే.... మీలోని లోపాలను మీరు గుర్తించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి.... అని ఎన్టీఆర్ అన్నారు.

    మనం ఇరగదీసేయగలం అనుకోవాలి

    మనం ఇరగదీసేయగలం అనుకోవాలి

    పొద్దున లేచి నువ్వు బావున్నావ్, బ్రహ్మాండంగా ఉన్నావ్, నువ్వు ఇరగదీసేయగలుగుతావు మనకు మనం అనుకోక పోతే ఎంత మంది వచ్చి మిమ్మల్ని పుష్ చేద్దామన్నా కుదరదు. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని.... ఎన్టీఆర్ చెప్పకొచ్చారు.

    మన ప్రయత్నం చేయాలి, ఎక్కువ వస్తే బోనస్

    మన ప్రయత్నం చేయాలి, ఎక్కువ వస్తే బోనస్

    మనం ఏదైనా పని చేసేపుడు ఇంత అనుకుని చేయాలి. అంతకు మించి ఫలితం వస్తే అది బోనస్. బిగ్ బాస్ నేను ట్రై చేద్దాం అని బయల్దేరిన ఒక ప్రయత్నం. ఈ రోజు వచ్చిన అప్లాజ్ బోనస్. బిగ్ బాస్ సక్సెస్ వెనక చాలా మంది ప్రయత్నం, శ్రమ ఉంది. నా వంతు ప్రయత్నం నేను చేశాను అని ఎన్టీఆర్ తెలిపారు.

    English summary
    “Bigg BossTelugu has been a very challenging but enjoyable ride. Will always be grateful for all the love and support you have shown,” NTR posted on his Twitter page after hosting the grand finale.“ Will miss “Naa TV” and the chance to interact with you all every weekend,” he added. "Thank You Tarak..Lets wish together to start #BiggBossTelugu Season-2 Soon and start working together again!! " STAR MAA tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X