జూ ఎన్టీఆర్ ప్లాన్ అదా?

By Staff

Jr Ntr
జూనియర్ ఎన్టీఆర్ ఇంతటి గాలి దుమారంగా పర్యటించడానికి ప్రధాన కారణమేమిటి? మామ చంద్రబాబు వాడుకుని వదిలేస్తాడని భయం ఉంది. బాబాయ్ బాలయ్య అంటీ ముట్టనట్టు ఉంటాడు. చిన్నప్పటి నుంచి తండ్రి హరికృష్ణతో ఆనందంగా గడిపిన ఘడియలు చాలా తక్కువ. తాత ఎన్టీఆర్ వద్ద ఉన్నదీ లేదు. మరి ఈ జూనియర్ కు ఎందుకింతగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలన్న పట్టుదల వచ్చింది. ఆయన సభలకు వచ్చే జనమంతా ఓట్లు వేస్తారా? హరికృష్ణ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా లేరు? అయితే జూనియర్ జనంలో సంచనం సృష్టిస్తున్నాడు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రధాన బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.

ఎన్టీఆర్ కు అన్ని విషయాలు తెలిసినా ఆయన ఉభయతారకంగా ఉంటుందని రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. "కోటిగాడి కోడి కొడితే కొడుతుంది, లేకపోతే కూరకు పనికి వస్తుంది" అన్న సామెతని ఎన్టీఆర్ నమ్ముతున్నట్టు కన్పిస్తోంది. "సాంబ" సినిమా నుంచి బాగా లావెక్కడం మొదలైంది. "రాఖీ"లో ఏకంగాభారీ సైజుకు చేరుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గి హిట్ కొట్టాలన్న తపనతో లైపో సక్షన్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఒక కిలో బరువు కరిగించడానికి పది వేల రూపాయలు ఖర్చవుతుంది. మళ్ళీ బాగా తినడం మొదలైతే కథ మొదలు. ఇంట్లో ఉంటే తినే నోరు ఊరుకోదు కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిరవధికంగా 40 రోజుల పాటు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రోజూ ఎంతో దూరం ప్రయాణీస్తూ ఎన్నో ఉపన్యాసాలిస్తూ మితాహారం తీసుకుంటున్న ఎన్టీఆర్ కొంత నల్ల బడినా, బరువు మాత్రం నియంత్రణలో ఉంది. ఇదే కంటిన్యూ అయితే చంద్రబాబు ఆయనకు ఏమీ చేయకపోయినా, ఆయనకు ఆయన సినిమాలో మరీ మంచి స్ధాయికి ఎదిగే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X