Check మూవీకి జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్: ఎప్పటికీ ఆయనకు అభిమానినంటూ ట్వీట్

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కించే ఆయన.. టాలీవుడ్‌లోనే టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా వెలుగొందుతున్నారు. ఇప్పటికే ఎన్నో మంచి సినిమాలను రూపొందించిన ఈయన.. ఇప్పుడు యంగ్ హీరో నితిన్‌తో 'చెక్' అనే సినిమాను తీశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 26) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ట్వీట్ చేశాడు.

Jr NTR Send Special Wishes to Nithiins Check Movie

తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్‌లో 'చెక్' మూవీ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. 'నేనెప్పటికీ చంద్రశేఖర్ ఏలేటికి పెద్ద అభిమానిని. ఆయన ఇతివృత్తాలు, స్టోరీని చూపించే విధానం అంటే నాకెంతో ఇష్టం. 'చెక్' మూవీ చాలా ఆసక్తికరంగా ఉంది. రేపు సినిమా విడుదల అవుతున్న సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ సినిమా బృందానికి కొత్త ఊపు వచ్చినట్లైంది. మరోవైపు, దర్శకుడిని అభినందిస్తూ వేరే హీరో సినిమాకు మద్దతుగా నిలిచిన తారక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Jr NTR Send Special Wishes to Nithiins Check Movie

ఇదిలా ఉండగా, నితిన్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తద్వారా దీనికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.10 కోట్లు వరకూ జరిగినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X