యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ వరుసగా మొదలెట్టేస్తున్నాడు...
2010లో జూ ఎన్టీఆర్ చేసిన రెండు సినిమాలు అదుర్స్, బృందావనం, సూపర్ హిట్ కావడంతో జూ ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. 'శక్తి"ని సూపర్ హిట్ చేయ్యాలన్న పట్టుదలతో ఎన్టీఆర్, మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నారట. ఎన్టీఆర్ నెక్స్ ట్ చేయ్యబోయే రెండు సినిమాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
ఫిబ్రవరి 28న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో బివియస్ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రం, ఏప్రిల్ 1న సింహా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కెయస్ రామారావు నిర్మించే సినిమాలు కనీసం రెండు రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం అవుతున్న రెండు చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ చిత్రాలకు టైటిల్స్ ను ఇంతవరకు కన్ ఫర్మ్ చెయ్యలేదు. అయితే కొన్ని టైటిల్స్ ప్రస్తుతం ప్రచారంలో వున్నాయి. ఆ టైటిల్సే పెడతారా లేక వేరే టైటిల్స్ అనుకుంటున్నారా అనేది తెలియాల్సి వుంది.


Click it and Unblock the Notifications











