twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరణ్-బన్నీ వల్లే జూ ఎన్టీఆర్ న్యూ ట్రెండ్ సెటర్ గా...

    By Sindhu
    |

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్, తమన్నా నటిస్తున్న చిత్రం 'ఊసరవెల్లి". టాలీవుడ్ డ్యాన్సర్స్ లో బెస్ట్ డ్యాన్సర్ గా జూ ఎన్టీఆర్ నిరూపించుకొన్నాడు. తన ప్రతీ సినిమాకి డాన్స్ ల్లో వేరియేషన్స్ చూపిస్తూ తన ఫ్యాన్సునే కాక ప్రేక్షకులని కూడా ఆశ్చర్య పరిచే టాలెంటెడ్ పర్సన్ జూ ఎన్టీఆర్. తను చిన్నప్పటి నుంచి నేర్చుకొన్న క్లాసికల్ డాన్స్ తను చేయబోయే హై ఎనర్జీ డాన్స్ ల కొత్త స్టెప్స్ కి చాలా ఉపయోగపడుతోంది.

    ప్రేక్షకులని ఆకట్టుకోవాలంటే స్టార్స్ వున్నా లేకపోయినా సినిమాలో ఏదోఒక ఆసక్తికరమైన అంశం వుంటే గానీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని బాగా వంటబట్టించుకున్నాడో ఏమోగానీ జూ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తను నటిస్తున్న (ఊసర వెల్లి టైటిల్ నిర్ణయించలేదు) చిత్రంలో ఓ కొత్త ఫీట్‌ని చేయబోతున్నాడు. తన దైన మార్క్ యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునే క్రేజీ హీరోగా ఎదిగిన జూఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు డాన్సుల్లోనూ అదరగొడతాడన్న విషయం తెలిసిందే.

    అయితే సురేందర్‌డ్డి దర్శకత్వంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం జూ ఎన్టీఆర్‌ పై ఓ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ పాటకు తెలుగు చిత్ర పరిక్షిశమలోని టాప్ డాన్స్ మాస్టర్లలో ముగ్గురు నృత్యరీతులు సమకూర్చనున్నారని క్లాసికల్ వెస్ట్రన్ రీమిక్స్ బీట్ ఇలా మూడు వేరియేషన్స్ లో సాగే ఈ పాట ట్రెండ్ సెట్టర్‌ గా నిలవనుందని సమాచారం. ఇదిలావుంటే రామ్‌ చరణ్ అల్లు అర్జున్ డాన్సుల్లో గట్టిపోటీనివ్వడం వల్లే జూ ఎన్టీఆర్ తన తాజా చిత్రం కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్లతో డిఫంట్ సాంగ్‌ని ప్లాన్ చేశాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. జూ ఎన్టీఆర్ చేస్తున్న ఈ పాట నిజంగానే ట్రెండ్ సెట్టర్‌ గా మారుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

    English summary
    Jr Ntr who has a classical dance as a background will always try to woo the audiences with his amazing dance moves in every film. And the news is that the top three choreographers are working for this single track which is a blend of western, classical and remix beats that is composed by Devi Sri Prasad for the film oosaravelli. And Sources say that this song would become a trend-setter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X