జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్‌గా ఉండడానికి కారణం అదేనా..?
జూనియర్ ఎన్టీఆర్ శక్తిని ప్రపంచానికి చాటాలనే ఉద్దేశ్యంతో నిర్మాత అశ్వినిదత్ తనవంతు ప్రయత్నం తాను చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం తనకు ఏమి పట్టనట్లు ఉన్నాడని సమాచారం. శక్తి చిత్రం స్టిల్స్, డిజైన్స్ చూసి అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐతే ఎన్టీఆర్ మాత్రం ఇదేమి పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పెళ్శి పనుల్లో బిజీగా ఉన్నాడని సమాచారం.
గతంలో ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్న ఎన్టీఆర్ మూడు నెలలు నుండి దాని జోలికి వెళ్శడం లేదు. శక్తి సినిమాకి వస్తున్న హైప్‌ను చూసి ఎన్టీఆర్ కూడా ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుంటున్నట్లు ఉన్నాడని వినికిడి. సినిమా విడుదలకి ముందు హాడావుడి చేయడం కంటే సైలెంట్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తన శక్తిని చూపించాలని భావిస్తున్నాడని అనుకుంటున్నారు.
గతంలో కూడా చాలా సినిమాల విడుదలకు రెచ్చిపోయిన ప్రతిసారీ బోక్క బోర్లా పడడం మనం చూశాం. దానిని మనసులో పెట్టుకోని ఈసారి అలాంటి హాంగామా లేకుండా తన సత్తా చూపించడానికి సిద్దంగా ఉన్నాడని సమాచారం. ఇకపోతే ఈసినిమా పాటలను ఈనెల 27న హైదరాబాద్ లలిత కళాతోరణంలో అభిమానుల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











