twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వధర్మ సంరక్షణే 'శక్తి' (ఎన్టీఆర్ శక్తి ప్రివ్యూ)

    By Srikanya
    |

    జూ ఎన్టీఆర్,ఇలియానాల కాంబినేషన్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన శక్తి చిత్రం ఈ రోజు(శుక్రవారం) అంతటా విడుదల అవుతోంది.అష్టాదశ శక్తిపీఠాల నేపథ్యంలో సాగే కథ ఇది. దుష్ట శక్తులు మన దేశాన్ని నాశనం చేయాలని పావులు కదుపుతుంటే... దైవ సంకల్పంగల శక్తి (ఎన్టీఆర్‌) వాటికి అడ్డుగా నిలుస్తాడు. ఇలియానా కూడా శక్తికి జత కడుతుంది. వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? మన ధర్మాన్ని ఎలా రక్షించుకొన్నారు? అనేదే మిగతా కథ.

    ఇక ఈ చిత్రం గురించి నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ శక్తియుక్తులకు అద్దం పట్టే చిత్రమిది. జగన్మాత ఆది పరాశక్తిని తలచుకొంటూ ప్రారంభమైన కథ ఇది. భక్తి ,ఓ యువకుని శక్తి రెండూ కలిస్తే ఈ సినిమా. మాస్‌ అంశాలకు ప్రాధాన్యమిచ్చిన సోషియో ఫాంటసీ చిత్రమిది. ప్రతి పాత్రా కథకు అనుగుణంగా నడిచేదే. మహాకుంభమేలాలో చిత్రీకరించిన సన్నివేశాలు, ఎన్టీఆర్‌ ఫైట్స్ ,డాన్స్ లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆయన పాత్రలోని భిన్న పార్శ్వాలు అందర్నీ అలరిస్తాయ అంటున్నారు.

    'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె. ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు,గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. ఎన్టీఆర్..ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ అంటున్నారు తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్తున్నారు.ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు.

    సంస్థ: వైజయంతీ మూవీస్‌
    నటీనటులు: జూ ఎన్టీఆర్‌, ఇలియానా, సోనూ సూద్‌, ప్రభు, మంజరి, జాకీష్రాఫ్‌, పూజాబేడీ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణభగవాన్‌, తదితరులు.
    మాటలు: సత్యానంద్
    రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్
    ఆర్ట్: ఆనంద్‌సాయి
    కెమెరా: సమీర్ రెడ్డి
    సంగీతం: మణిశర్మ
    సమర్పణ: సి. ధర్మరాజు
    నిర్మాత: సి.అశ్వనీదత్‌
    స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

    English summary
    Ashwini dutt said the story of Shakti is about Shakti Peethams. NTR’s role will have 5 dimensions in the movie. Shakti film is all set to release on 30 March.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X