ఈజిప్ట్ మమ్మీల దగ్గరకు జూ ఎన్టీఆర్ 'శక్తి'
ఈనెల 20న 'శక్తి' యూనిట్ ఈజిప్ట్ వెళ్లనున్నారు. ఎన్టీఆర్ మినహా ప్రధాన తారాగణంపై అక్కడ వారం రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అలాగే జూలై 10 నుంచి లడక్, కాశ్మీర్, హరిద్వార్, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు భారీ షెడ్యూలు చేయనున్నారు. అలాగే ఇప్పటి వరకూ ఈ చిత్రం హైదరాబాద్, జైపూర్‌ల్లో భారీ షెడ్యూలు జరుపుకుంది. ఇక ఈజిప్టులో జరిగే సీన్స్ విలన్స్ కి సంభందించినవని, అవి చిత్రంలో కీలక ఘట్టాలు కాబోతున్నాయని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. 'కంత్రి' తరువాత ఎన్టీఆర్, మెహర్ రమేష్, సి.అశ్వనీదత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఇది.
అలాగే ఇంతవరకూ ఎన్టీఆర్ చేయని ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తయారవుతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గెటప్, పాత్ర చిత్రణ, సంభాషణలు...క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. 'రాఖీ' తరువాత ఎన్టీఆర్ సరసన ఇలియానా నటిస్తున్న సినిమా ఇదే. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, కెమెరా: సమీర్‌రెడ్డి, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి.


Click it and Unblock the Notifications











