‘మగధీర’ ఇన్స్ ఫిరేషన్ తోటే జూ ఎన్టీఆర్ ‘శక్తి’...
అన్ లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమని 'శక్తి" లాంఛ్ రోజునే అశ్వనీదత్ ఈ చిత్రంపై క్రేజ్ పెంచేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగు తెరపై రూపొందిన అత్యంత కాస్ట్ లీ సినిమాగా చరిత్రకెక్కుతుందని అంటున్నారు. 'మగధీర" ఇచ్చిన నమ్మకంతో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం 'శక్తి". ఇందులో ఎన్టీఆర్ డ్యూయోల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర ఎన్టీఆర్ ఎప్పుడూ చేసే క్యారెక్టర్స్ కి దగ్గరగానే ఉంటుంది కానీ మరో క్యారెక్టర్ మాత్రం ప్రేక్షకాభిమానుల్ని సంభ్రమాశ్చర్యాలకి గురి చేసేలా ఉంటుందని తెలిసింది.
ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ లో జూ ఎన్టీఆర్ విజృంభించి నటించాడని, 'శక్తి" సినిమా రిలీజైన తర్వాత ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు మళ్లీ మళ్లీ చూడడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ 'శక్తి" ఏమిటో చూపిస్తాడని, తెలుగు చలన చిత్ర చరిత్రలో అతి పెద్ద బ్యాక్ బస్టర్ లిస్ట్ లో ఈ చిత్రం చేరుతుందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. బయ్యర్లు కూడా ఈ చిత్రంపై అమితమైన నమ్మకంతో ఉన్నారు. అందుకే అన్ని ఏరియాల నుంచి 'శక్తి"కి రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి..


Click it and Unblock the Notifications











