‘శక్తి’తో తన స్టార్ డమ్ చాటి చెప్పుకోవాలని తహతహలాడుతున్న జూ ఎన్టీఆర్
2010 ఆరంభంలో 'అదుర్స్" తో ఓ మోస్తరు విజయం దక్కించుకుని, 'బృందావనం"చిత్రంతోనూ పర్వాలేదనిపించుకున్న జూ ఎన్టీఆర్..తన తాజా చిత్రం 'శక్తి"తో తన స్టార్ డమ్ తాలూకు శక్తిని చాటి చెప్పుకోవాలని తహతహలాడుతున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తీర్చిదిద్దబడుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో బివి యస్.ఎన్ ప్రసాద్ నిర్మించే చిత్రంలో నటించేందుకు అంగీకరించిన జూ ఎన్టీఆర్..బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ మరో చిత్రంలో నటించేందుకు అంగీకరించడం తెలిసిందే. అంటే 2011లోనూ తను నటించే చిత్రాలు కనీసం రెండైనా విడుదలయ్యేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటుండడం విశేషం..
జూ ఎన్టీఆర్ శక్తి మెహర్ రమేష్ అశ్విని దత్ అదుర్స్ బృందావనం jr ntr shakti meher ramesh ashwini dutt adurs brindavanam


Click it and Unblock the Notifications