జూ ఎన్టీఆర్ - ఇలియానాల ‘శక్తి’ విడుదల వాయిదా పడే అవకాశం..!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'శక్తి' సినిమా ఈ నెల 30 విడుదల కావలసి ఉంది, తాజా సమాచారం ప్రకారం విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన గ్రాఫిక్ వర్క్ ఇంకా కొనసాగుతూనే ఉంది, మార్చి 26 కు గాని ఆ పని పూర్తీ కాదంట.. అదే కనుక జరిగితే మిగత కార్యక్రమాలకు సమయం సరిపోదు గనుక చిత్రం వాయిదా పడే అవకాశం ఉంది అని సమాచారం.
మెహర్ రమేష్ దర్సకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై అశ్వని దత్ 'శక్తి' చిత్రాన్ని ప్రతిస్తాత్మకంగా తెరకెక్కించారు. ఇలియానా, జూ ఎన్టీఆర్ తో జతకడుతున్న ఈ చిత్రంలో జాకి షరాఫ్, సోను సూద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ స్వరపరిచిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పాటలు విజయం సాదించడం తో అంచనాలను పెంచేసుకున్న జూ ఎన్టీఆర్ అభిమానులు సినిమా విడుదల కోసం మరో వారం వేచి చూడాలేమో..!
jr ntr shakti ileana meher ramesh ashwini dutt mani sharma జూ ఎన్టీఆర్ శక్తి ఇలియానా మెహర్ రమేష్ అశ్వినీదత్ మణిశర్మ


Click it and Unblock the Notifications