తమిళంలో తన సత్తా చాటడానికి సిద్దమైన జూనియర్ ఎన్టీఆర్...
ప్రస్తుతం యావత్ తెలుగు సినీపరిశ్రమ దృష్టి అంతా జూనియర్ ఎన్టీఅర్ 'శక్తి' పైనే వుంది. అశ్వినిదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కవ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తేలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఖీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకోని ఉన్నాయి.
ఈసినిమాలో గతంలో మోహన్ బాబు ప్రక్కన చిట్టెమ్మ మొగుడు సినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి పూజాబేడి ఈజిప్టు రాణిగా నటిస్తున్నారు. ఇక పోతే ఈసినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శుభప్రదం సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటించినటువంటి మంజరి ఫడ్నిస్ పూజాబేడి కూతరుగా నటించనున్నారని సమాచారం. ఇక ఈసినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఈనెల 27న అభిమానుల సమక్షంలో లలితకళాతోరణంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇంత వరకు జూ ఎన్టీఆర్ సినిమాలు తమిళంలో విడుదల కాలేదు. కానీ ఈసారి శక్తి చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల చేయాలని నిర్మాత అశ్వినీదత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో మొట్టమొదటి సారి జూ ఎన్టీఆర్ ఈ చిత్రంతో తన 'శక్తి'ని తమిళంలో కూడా చూపెట్టనున్నారు.


Click it and Unblock the Notifications











