జూ ఎన్టీఆర్ శక్తి విడుదలకు ముందే రికార్డు...
జూ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో 'అశ్వినీదత్" నిర్మించిన 'శక్తి" చిత్రం విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చెప్పలేం కానీ ఇప్పుడు మాత్రం ఓ రికార్డ్ సృష్టించింది. ఎక్కువ ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్ట్ క్రియేట్ చేస్తుందని ఈ యూనిట్ అంటుంది. లడక్, జైపూర్, హరిద్వార్, కులుమనాలి, హంపి, బదామి, ఈజిప్ట్, హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు చిత్రీకరించారు. త్వరలో మరికొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఫైనల్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయనున్నారు. ఈ చిత్రంతో ఇలియానా హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటి వరకు వైజయంతి మూవీస్ పతాకంపై ఏ చిత్రాన్ని నిర్మించనంత భారీగా అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట. ఈ 35 ఏళ్లల్లో అశ్వనీదత్ నిర్మించిన చిత్రాల్లో ఇదే భారీ చిత్రం అవుతుందని, చరిత్రను సృష్టిస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











