పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్: అందుకే గ్యాప్.. ఇప్పుడు అవసరం వచ్చిందంటూ కామెంట్

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. సాదాసీదాగా పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే అన్ని విభాగాల్లోనూ రాణించి స్టార్‌గా ఎదిగిపోయాడు. అదే సమయంలో తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ మధ్య తన తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించిన అతడు.. ఆ తర్వాత కామైపోయాడు. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు తారక్. ఆ వివరాలు మీకోసం!

 వరుస విజయాలతో జోష్ మీదున్న తారక్

వరుస విజయాలతో జోష్ మీదున్న తారక్

కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి మొదలుకొని 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. దీంతో ఇప్పటి స్టార్ హీరోల్లో ఏకంగా ఐదు విజయాలు అందుకుని రికార్డులకెక్కాడు.

 టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంతో ఎన్టీఆర్

టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మక చిత్రంతో ఎన్టీఆర్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా టాలీవుడ్‌లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతుంది. ఇందులో తారక్.. కొమరం భీంగానూ, చరణ్.. అల్లూరి గానూ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.

 అప్పుడే లైన్‌లో పెట్టుకుంటోన్న జూనియర్

అప్పుడే లైన్‌లో పెట్టుకుంటోన్న జూనియర్

RRR షూటింగ్ జరుగుతుండగానే.. జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాను కల్యాణ్ రామ్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు తారక్. ఆ తర్వాత కూడా లిస్టు ప్రిపేర్ చేసుకున్నాడు.

 ఆ షోతో మెప్పించేందుకు చేసేందుకు రెడీగా

ఆ షోతో మెప్పించేందుకు చేసేందుకు రెడీగా

గతంలో బిగ్ బాస్ షో ద్వారా హోస్టుగా అలరించిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరోసారి బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో వచ్చి సూపర్ సక్సెస్ అయిన షోను.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' పేరిట తీసుకొస్తున్నారు. జెమినీ టీవీలో ప్రసారం కానున్న దీనినే తారక్ హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఈ ప్రోమో కూడా విడుదలైంది.

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్

పొలిటికల్ ఎంట్రీపై ఎన్టీఆర్ షాకింగ్ రియాక్షన్

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు సంబంధించిన వివరాలన వెల్లడించేందుకు గానూ.. తాజాగా నిర్వహకులు ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఇందులో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో క్వచ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు తారక్.

ఓ రోజు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం

ఓ రోజు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం

'మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది' అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ఎన్టీఆర్ 'దీనికి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుందండి. ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి. పర్లేదు మీరే ఆన్సర్ చెప్పండి' అంటూ ఊహించని విధంగా స్పందించాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. 'ఇప్పుడు సమయం.. సందర్భం కాదు. ఓ రోజు కాఫీ తాగుతూ మనమే కబుర్లు చెప్పుకుందాం' అని వివరించాడు.

 అందుకే గ్యాప్.. ఇప్పుడు అవసరం వచ్చింది

అందుకే గ్యాప్.. ఇప్పుడు అవసరం వచ్చింది

ఇదే సందర్భంలో 'మూడేళ్లుగా మీది ఒక సినిమా కూడా విడుదలవలేదు. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకే ఈ షో చేస్తున్నారా' అని మరో ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి స్పందిస్తూ.. 'బ్రదర్... సినిమాలకు నేను గ్యాప్ ఇవ్వలేదు. తీసుకోవాల్సి వచ్చింది. RRRకు ఆ అవసరం ఉంది. ఇక, షో అంటారా... ఇది సరైన సమయానికి రెడీ అవుతుంది అంతే. ప్లానింగ్ ఏమీ లేదు' అంటూ చెప్పాడు తారక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X