జూ ఎన్టీఆర్ రెండు చిత్రాలు ఒకే చోట....
జూ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న బృందావనం, శక్తి చిత్రాలు రెండు వికారాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. శక్తి చిత్రానికి సంభందించిన ఫైట్ ని ఇక్కడ ప్లాన్ చేసారని, సోనూసూద్ తో ఈ పోరాటం చోటుచేసుకోనట్లు తెలుస్తోంది. ఇక వంశీ ఫైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న బృందావనంకి సంభందించిన కీలకమైన సన్నివేసాలు కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నారని చెప్తున్నారు. రెండూ ఒకే చోట పెట్టుకునేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకోమని సూచించాడని, దాని వల్ల రెండు షూటింగ్ లు అంతరాయం లేకుండా జరుగుతాయని ఆయన భావిస్తున్నారని చెప్తున్నారు.ఇక బృందావనంలో సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తూంటే, శక్తిలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూంటే అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బృందావనం..రొమాంటిక్ ఎంటర్టైనర్ అయితే శక్తి...సోషియో ఫాంటసీ అని వినపడుతోంది.
జూ ఎన్టీఆర్ శక్తి బృందావనం సోనూ సూద్ ఇలియానా కాజల్ సమంత మెహర్ రమేష్ jr ntr shakti kajal samantha ileana meher ramesh


Click it and Unblock the Notifications