twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ ఎన్టీఆర్.. జబర్దస్త్ కమెడియన్‌కు యంగ్ టైగర్ దండం.. అదరగొట్టిన హైపర్ ఆది

    |

    సైబరాబాద్ పోలీసు విభాగం నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక కాన్ఫరెన్స్‌ ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భావోద్వేగం ప్రసంగం చేసిన ఎన్టీఆర్.. తోటి కళాకారులపై తన గౌరవాన్ని ప్రదర్శించి తన గొప్పతనాన్ని చాటుకొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    హైపర్ ఆది టీమ్ రచ్చ

    హైపర్ ఆది టీమ్ రచ్చ

    సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్షిక కాన్ఫరెన్స్‌ వేడుకల్లో జబర్దస్త్ షో ఫేమ్ హైపర్ ఆది బృందం ఓ స్కిట్‌ను ప్రదర్శించింది. రోడ్డు ప్రమాదాల నివారణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే కథాంశంతో చిన్న నాటికను ప్రదర్శించారు. ఈ స్కిట్ అతిథులను, ఇతర సభ్యులను ఆకట్టుకొన్నది.

    హైపర్ ఆది పంచులతో మరోసారి

    హైపర్ ఆది పంచులతో మరోసారి

    హైపర్ ఆది ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా, రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, పరదేశి నాయుడు, సాయి తదితరులు ఈ నాటకంలో కీలక పాత్రలు పోషించారు. ఎప్పటి మాదిరిగానే హైపర్ ఆది పంచులతో మోత మోగించారు. హైపర్ ఆది డైలాగ్స్‌కు విశేషమైన స్పందన లభించింది.

     హైపర్ ఆది టీమ్‌కు జూనియర్ ఎన్టీఆర్ సత్కారం

    హైపర్ ఆది టీమ్‌కు జూనియర్ ఎన్టీఆర్ సత్కారం

    అనంతరం హైపర్ ఆది బృందానికి ఎన్టీఆర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా రైజింగ్ రాజు, శాంతి స్వరూప్, పరదేశి నాయుడు, సాయిని శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు.

    రైజింగ్ రాజుకు దండం పెట్టిన ఎన్టీఆర్

    రైజింగ్ రాజుకు దండం పెట్టిన ఎన్టీఆర్

    జబర్దస్త్ కమెడియన్లను సత్కరించే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కాళ్లపై పడి రైజింగ్ రాజు నమస్కరించారు. అది గమనించిన ఎన్టీఆర్ వెంటనే వంగి రైజింగ్ రాజును పైకి లేపాడు. పెద్ద వాళ్లు అలా కాళ్లు మొక్క కూడదని చెబుతూ తిరిగి రైజింగ్ రాజుకు దండం పెట్టారు. దాంతో ఎన్టీఆర్ వినయం, విధేయత మరోసారి చర్చనీయాంశమైంది.

    English summary
    Jr NTR gets emotional at Cyberabad Traffic Police Annual Conference over father Harikrishna and brother Janaki Ram Death. He attended a conference as Cheif guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X