నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని వదిలేసారంటూ..!?
రీసెంట్ గా జరిగిన విజయవాడలో జరిగిన ఓ సంఘటనతో నందమూరి అభిమానలు ..జూ.ఎన్టీఆర్ సైడ్ లైన్ చేసారా అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ అధినాయకుడు చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పబ్లిసిటీ పోస్టర్స్ విజయవాడలో వేసారు. కానీ ఆ పోస్టర్స్ పై ఎన్టీఆర్ ఎక్కడా ఉండడు. దాన్దేముంది బాలకృష్ణ సినిమా పోస్టర్ పై ఎన్టీఆర్ ఫోటో ఉండాల్సిన పనేముంది అనొచ్చు..కానీ ఆ పోస్టర్స్ పై నందమూరి కుటుంబ హీరోలందరి ఫోటోలు ఉన్నాయి. అంతేగాక నందమూరి మోక్షజ్ఞ,నారా రోహిత్ లను కూడా డిస్ ప్లే చేసారు. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్ లేరు. నందమూరి అబిమానులు జయం ధియోటర్ వద్ద పెట్టిన ఈ పోస్టర్ చర్చనీయాంశంగా అయ్యింది.
ఇక అధినాయకుడు చిత్రం విషయానికి వస్తే...బాలకృష్ణ అభిమానలుకు మాత్రమే కాక అందరికీ నచ్చే చిత్రం ఇది అంటున్నారు దర్శకుడు. అలాగే... కథ గురించి దర్శకుడు మాట్లాడుతూ...నాయకత్వం వ్యాపారం కాదు... వారసత్వంగా రావటానికి. వెనకనున్న పదిమంది ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చాలి. అప్పుడే నాయకుడు అవుతాడు. అలాంటివాళ్లు మాత్రమే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకొంటారు. తరతరాలుగా ప్రజాసేవకు అంకితమై నాయకత్వ లక్షణాల్ని పుణికి పుచ్చుకొన్న ఓ కుటుంబం కథే మా చిత్రం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్.ఎల్ కుమార్‌చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆరు పాటలు సహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బాలకృష్ణ ఇందులో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.
తాతగా, తండ్రిగా, తనయుడిగా ఒకదానితో ఒకటి పొంతనలేని పాత్రల్లో ఆయన కనిపిస్తారు. జయసుధ, సలోని, లక్ష్మీరాయ్ ఆ మూడు పాత్రలకు జోడీలుగా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్‌రాజ్, ఎమ్మెస్‌నారాయణ, వేణుమాధవ్, ఆదిత్యమీనన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











