జూ ఎన్టీఆర్ ‘దమ్ము’కి సింహా గెటప్ అదుర్స్...!?
బృందావనం, ఊసరవెల్లి సినిమాలలో మీసాలు లేకుండా లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ ఎన్టీఆర్ ఇప్పుడు గోపిచంద్ 'మొగుడు" ఆడియో ఫంక్షన్ లో సరికొత్త మీసకట్టుతో కనిపించారు. ఈ మీసకట్టు బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సినిమా బాలకృష్ణ 'సింహా"ను పోలి వుండటంతో, బోయపాటి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా 'దుమ్ము" సినిమా గెటప్ అని అనుకుంటున్నారు.
జూ ఎన్టీఆర్ ని ఈ కొత్త గెటప్ లో చూసి అభిమాను పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడంటూ నందమూరి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నిన్న జరిగిన మొగుడు" ఆడియో విడుదల వేడుకకు ఇలా కొత్త గెటప్ లో జూ ఎన్టీఆర్ దర్శనమిచ్చాడు. మొత్తంగా గెటప్ మార్చేయకపోయినా. కోర మీసంతో జూ ఎన్టీఆర్ రాయసీమ బిడ్డ మీసం మెలేస్తే ఎలా ఉంటాడో అలాఉన్నాడంటూ అభిమానులు సంతోషం వ్యక్త చేస్తున్నారు. ఇదంతా జూ ఎన్టీఆర్ దమ్ము కోసమేనని ఈ పినిమా పవర్ ఫుల్ గా తెరెకెక్కనుందనీ తెలుస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు మూస ధోరణిలో ఒకే రకమైన సినిమాలు అందించకుండా, ఇలా కొత్తరకంగా కనిపించడానికి ఆరాట పడుతున్న మన తెలుగు హీరోలను అభినందించాలి, ఆదరించాలి. అప్పుడే మన హీరోలు ఎక్సపరమెంట్స్ చేయడానికి ధైర్యం ఉత్సాహం వస్తాయి. మన తెలుగు సినిమా స్థాయి పెరిగి వేరే రాష్ట్రాలకే కాదు దేశాలకు కూడా వ్యాపించే అవకాశం వుంది.


Click it and Unblock the Notifications











