స్టూడియోలో: ఎన్టీఆర్ పాట పాడుతూ...( వీడియో)

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ 'రభస' కోసం గళం విప్పిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఓ పాట పాడబోతున్నాడని ప్రచారం జరిగి అది నిజం అయ్యింది. ఇదివరకు 'యమదొంగ'లో పాడిన ఆయన ఇప్పుడు 'రభస' కోసం 'రక్కసి రాకాసి' అనే పాటను పాడారు. ఇప్పుడా పాట ఆడియోలో సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ చిత్రం నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ పాట మేకింగ్ ని విడుదల చేసారు. ఇదిగో ఇక్కడ చూడండి....

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/pg7kgRWt3Kw" frameborder="0" allowfullscreen></iframe></center>

బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువ నిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం 'రభస' ఈ చిత్రం ఆగస్ట్ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.

Jr NTR Singing Raakasi Raakasi Song - Making of Rabhasa

బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ-''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాడిన 'రాకాసి రాకాసి' ఈ ఆడియోకి హైలైట్ సాంగ్‌గా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. ఆదిలాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈచిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని, విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్టు 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌లో, మా బ్యానర్‌లో ఇది సెన్సేషనల్ హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ- యూత్‌పుల్, మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రభస' ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఎన్టీఆర్ రభసలో పక్కా మాస్ లుక్‌తో వుంటారు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వుంటారు. ఎన్టీఆర్ ఈ మూడు జోన్స్‌ని టార్గెట్ చేసి తీస్తున్న సినిమా రభస. రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసి అందరూ అయిదార్లుసార్లు చూసేంత ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. బెల్లం కొండ సురేష్‌గారి రేంజ్ మేకింగ్‌లో ఈ సినిమాలో కనిపిస్తుంది'' అన్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్. బ్రహ్మనందం,ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్‌రెడ్డి, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X