ఇద్దరు హీరోయిన్లతో జూ ఎన్టీఆర్ స్పెయిన్ ట్రిప్!
హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హాట్ హీరోయిన్లు సమంత, శృతి హాసన్‌లతో కలిసి స్పెయిన్ వెళ్లబోతున్నారు. ఇదంతా తన తాజా సినిమా 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం షూటింగులో భాగమే. ఈచిత్రంలో షూటింగ్ ఆగస్టు 26 నుండి స్పెయిన్లో జరిపేందుకు రంగం సిద్దమైంది.
తమన్ ఆడియో కంపోజింగ్ పూర్తి చేయడంతో అందులోని రెండు సాంగులను స్పెయిన్ దేశంలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఈ రెండు సాంగులు ప్రేక్షకులకు నయనానందకరంగా అద్భుతమైన డాన్స్ స్పెప్పులతో పాటు, రొమాంటిక్‌గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
సినిమా వివరాల్లోకి వెళితే...ఈచిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 27న విడుదల చేసి తీరుతామని అంటున్నారు దర్శక నిర్మాతలు. ఆగస్టు మూడో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.
బాద్‌షా తర్వాత ఎన్టీఆర్, గబ్బర్‌సింగ్ తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ-మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications












