Happy Birthday Ram charan: హగ్ చేసుకొని ఎన్టీఆర్ స్టిల్.. వాళ్ళతో కలిసి స్పెషల్ సర్‌ప్రైజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మొత్తానికి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఒకవైపు నందమూరి అభిమానులు మరోవైపు మెగా అభిమానులు ఇద్దరు కూడా ఈ సక్సెస్ ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో ఫ్యాన్స్ మరింత హ్యాపీగా మరో వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు ఎన్టీఆర్ కూడా తన ప్రాణ స్నేహితుడి బర్త్ డే రోజు మంచి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచి స్నేహితులుగా..

మంచి స్నేహితులుగా..

రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా కంటే ముందే మంచి స్నేహితులు అని చాలామందికి తెలియదు. ఇటీవల ఇంటర్వ్యూలలో కూడా అదే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెప్పాడు. మేము బయటకు ఎప్పుడు తమ స్నేహాన్ని చూపాలని అనుకోలేదని ప్రైవసీగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతామని అన్నాడు. రామ్ చరణ్ కూడా తారక్ తో మాట్లాడితే టైమ్ చూసుకోను అని చెప్పాడు.

అప్పుడు క్లోజ్ అయ్యాం..

అప్పుడు క్లోజ్ అయ్యాం..

ఇక రామ్ చరణ్ తేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ స్నేహం ఎప్పుడు ఎలా మొదలైంది అనే విషయాలపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాము ఇద్దరం మొదట సెలబ్రెటీ క్రికెట్ లీగ్ ఆడేటప్పుడు ఒకరికొకరం బాగా క్లోజ్ అయ్యమని అలాగే కలిసి క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.

ప్రతీ ఏడాది..

ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకరికొకరు వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన హ్యాపీ ముమెంట్స్ కూడా స్పెషల్ సెలబ్రేట్ చేసుకుంటారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరు స్టార్స్ ఒకరికొకరు పుట్టినరోజు కూడా సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ప్రతీ ఏడాది వీరి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఎదో ఒక ఫొటో వైరల్ అవుతూనే ఉంటుంది.

ఎన్టీఆర్ సర్‌ప్రైజ్

ఎన్టీఆర్ సర్‌ప్రైజ్

ఇక నేడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన భార్యతో కలిసి తన స్నేహితుడి పుట్టినరోజు కేక్ కూడా కట్ చేయించాడు. ఇక ఆ ఫొటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో ఆ ఫొటోను మిగతా అభిమానులు వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ఈ వేడుకలో రాజమౌళి తనయుడు కార్తికేయ అలాగే అతని భార్య కూడా పాల్గొన్నారు.

పవర్ఫుల్ కలెక్షన్స్

పవర్ఫుల్ కలెక్షన్స్

ఇక RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి రోజే బాహుబలి రికార్డులను బ్లాస్ట్ చేసిన RRR ఆదివారం కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది. ఇక సినిమా వీకెండ్ లో ఈజీగా రూ.500కోట్ల వరకు కలెక్ట్ చేయగలదని తెలుస్తోంది. ఇక బాహుబలి 2 టోటల్ కలెక్షన్స్ కూడా బ్రేక్ చేస్తుందని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అవ్వాలంటే మొత్తం 450కోట్ల షేర్ ను రాబట్టాలి. ప్రస్తుతం అయితే కలెక్షన్స్ స్టాండర్గ్ గానే ఉన్నాయి. మరి వీకెండ్స్ అనంతరం కలెక్షన్స్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X