ఇదే కదా మెగా నందమూరి అనుబంధం.. చెర్రీపై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్
మెగా నందమూరి బంధం గురించి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి బాలకృష్ణ మధ్య మంచి బంధమే ఉన్నా కూడా అప్పుడప్పుడు అది రకరకాలుగా మారుతూ ఉంటుంది. ఇక నాగబాబు బాలయ్య మీద చేసే కామెంట్లు.. బాలయ్య నాగబాబు మీద చేసే కామెంట్లతో మెగా నందమూరి బంధానికి బీటలు వారినట్టు అనిపిస్తుంటుంది. కానీ ఎన్టీఆర్ రామ్ చరణ్ స్నేహబంధం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

స్నేహబంధానికి ప్రతీకగా..
మెగా నందమూరి ఫ్యామిలీలకు ప్రతీకగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఇప్పుడు దూసుకుపోతోన్నారు. ఇలా రెండు పెద్ద ఫ్యామిలీలకు చెందిన హీరో ఇంత సన్నిహితంగా ఉంటే చక్కని వాతావరణం ఏర్పడుతుంది. ఫ్యాన్స్ వార్ ఎలా ఉన్నా కూడా హీరోలు మాత్రం ఎంతో సఖ్యతగా ఉంటారు.
నోరా ఫతేహి బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

మెగా నందమూరి..
ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగానందమూరి హీరోలను రాజమౌళి ఒకే స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. అయితే మొదట్లో ఈ ఇద్దరినీ ఎలా చూపిస్తాడు.. అభిమానులను నిరాశపరుస్తాడా? అని అనుమానాలు వెల్లిబుచ్చారు. కానీ టీజర్, పోస్టర్లతో ఆ అనుమానాలన్నీ తుడిచిపెట్టేశాడు రాజమౌళి.

నిప్పు, నీరు...
నిప్పు నీరు ఎంతటి గొప్ప స్థానాన్ని కలిగి ఉంటాయో అందరికీ తెలిసిందే. రెండూ వేటికవే గొప్పవి.. అలా ఎన్టీఆర్‌ను నీటితో.. రామ్ చరణ్‌ను నిప్పుతో పోల్చి రిలీజ్ చేసిన పోస్టర్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ కంటే ముందుగానే ఎన్టీఆర్, రామ్ చరణ్ బంధం ధృడంగా కలిసిపోయింది.

సోదరభావంతో..
రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరూ కూడా సోదరభావంతోనే ఉంటారు. తమ తమ పాత్రలకు సంబంధించిన టీజర్లు విడుదలైన క్షణంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తాజాగా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అదిరిపోయే ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు.

రామ్ చరణ్ భుజంపై..
రామ్ చరణ్ భుజంపై తాను వాలి ఉన్న ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. ఈ ఏడాది మనకు ఎంతో ముఖ్యమైంది. ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటుంది. నీతో ఉన్న ప్రతీ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది సోదరా అంటూ రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పాడు. ఈ ఫోటోను చూస్తే మెగా నందమూరి బంధం ఏంటో తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











