పెళ్ళికి వచ్చేవారిని ఎన్టీఆర్ పలకరించేందుకు ప్రత్యేకంగా క్రేన్
జూనియర్ ఎన్టీఆర్ తన పెళ్లిని సంప్రదాయబద్దంగా, తెలుగుదనం ఉట్టిపడేలా చేయాలని ప్లాన్ చేయటం అభిమానులనే కాక అందరినీ ఆనందపరుస్తోంది. పెళ్లికి వచ్చే వారిని పలకరించేందుకు జూనియర్ కోసం ప్రత్యేకంగా క్రేన్ తయారు చేసినట్లు సమాచారం. ఇక పెళ్ళి పూర్తి తెలుగుతనం ఉట్టిపడేలా ఏర్పాటు జరిగాలని మొదటినుంచీ ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు విందు భోజనాలు, అతిధి మర్యాదలు జరగాలని ఈవెంట్ ఆర్గనైజర్స్‌కు జూనియర్ ఆదేశించారు. అలాగే కళ్యాణమండపం చుట్టూ ఐదువేల మంది వరకు సిట్టింగ్ చేసే అవకాశంతో పాటు దేశీయ పూలతో పాటు సింగపూర్, బెంగుళూరు,మలేషియా తదితర చోట్ల నుంచి పూలను కూడా తెప్పించారు. దీనికి తోడు భోజన ఖర్చు, వస్త్రాలు అన్నింటితో కలిసి దాదాపు ఇరవై కోట్లు రుపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతిధి మర్యాదల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ఆయన చెప్పినట్లు సమాచారం. పెళ్లి ముహర్తం అర్థరాత్రి గం.2.41నిముషాలకు కాగా విందు మాత్రం రాత్రి ఏడుగంటల నుంచే ప్రారంభం కానుంది. భోజనాలు కూడా బఫే కాకుండా పంక్తి భోజనాలే ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications











