twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తొడగొట్టి తెలుగువాళ్ళం అని.. బాబాయ్‌ని ఏమని పొగడాలి..జూ. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

    |

    Recommended Video

    Jr NTR Outstanding Speech @ NTR Biopic Audio Launch | Filmibeat Telugu

    మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ కనివీని ఎరుగని రీతిలో నిర్వహించారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుంలా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆడియో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఆడియో వేడుకలో అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన జూ. ఎన్టీఆర్ తన స్పీచ్ తో అదరగొట్టాడు. ఎన్టీఆర్ ఎమోషనల్ ప్రసంగం ఆకట్టుకుంది.

     బాబాయ్ పక్కన ఇలా నిలబడితే

    బాబాయ్ పక్కన ఇలా నిలబడితే

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బాబాయ్ పక్కన ఇలా నిలబడితే ఇన్నిరోజులు బాబాయ్ ఉన్నాడు అని అనుకునే వాడిని. కానీ ఇప్పుడు నా పక్కన పెద్దాయన ఉన్నాడని అనిపిస్తోంది. నేను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడానికి రాలేదు. ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వలన లబ్ధిపొందిన తెలుగువాడిగా మాట్లాడడానికి వచ్చా. చిన్నతనంలో తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన గురించి తెల్సుకునే కొద్దీ అన్నగారు నందమూరి తారక రామారావు అని పిలిచేవాడిని.

    వాల్మీకిని అడిగారేమో

    వాల్మీకిని అడిగారేమో

    భూమ్మీద ధర్మం మూర్తీభవించిన వ్యక్తి లేడా అని వాల్మీకిని ఎవరైనా అడిగి ఉంటారు. ఎందుకు లేదు అదిగో శ్రీరామ చంద్రుడు అని వాల్మీకి రామాయణం రాశారు. ఆ తర్వాత తెలుగువారిలో అదే ప్రశ్న మొదలైంది ఏమో.. అలాంటి ధర్మ మూర్తి మళ్ళీ పుట్టడా అని.. ఆ ప్రశ్నలో నుంచి, శ్రీరామ చంద్రుడి కటాక్షంతో 1928 మే 28న ఒక ధృవ తార జన్మించింది.

    తొడగొట్టి తెలుగువాళ్ళం అని

    తొడగొట్టి తెలుగువాళ్ళం అని

    ఆయన గొప్ప బిడ్డే కాదు.. గొప్ప తండ్రేకాదు.. గొప్ప నాయకుడే కాదు.. కనీసం మనల్ని తెలుగువారు అని కూడా పిలవని రోజుల్లో.. ఇందిరా తెలుగువాడి గౌరవం, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఖ్యాతి అని తొడగొట్టి చెప్పుకుంటున్నాం అంటే అందుకు కారణం ఎందరో మహానుభావుల త్యాగాలు. అందులో నందమూరి తారకరామారావు గారు ప్రముఖులు.

    మా పిల్లలు అడిగితే

    అలాంటి వ్యక్తి ఇంకా ఉన్నారా అని మా పిల్లలు అడిగితే ఇంకా పుట్టలేదు అని చెబుతా. కానీ మా తాత గురించి మీ తాత చేసిన చిత్రం ఉంది అని చూపించుకుంటా అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా ప్రసంగించారు. మా భావితరాలకు ఆయన చరిత్రని ఈ చిత్రం ద్వారా తీసుకెళుతున్నారు. అందుకు బాబాయ్ ని ఏమని పొగడలో అర్థం కావడంలేదు. ఇది ఒక చరిత్ర.. చరిత్రకు జయాలు.. పరాజయాలు ఉండవు.. చరిత్ర సృష్టించడమే అని జూ. ఎన్టీఆర్ తెలిపాడు.

    English summary
    Jr NTR Speech at NTR Biopic Audio Launch
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X