మరోసారి కారు నెంబర్ కోసం భారీగా ఖర్చు చేసిన తారక్.. ఆ ధరకు మరో కొత్త కారు కొనవచ్చు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు కార్లు బైకులు అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు ఎక్కువగా ఖరిదైనా కార్లను ఇష్టపడతారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లపై స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. తనకు నచ్చితే ఆ కారును ప్రత్యేకంగా విదేశాల నుంచి తెప్పించుకోవడానికి కూడా సిద్ధపడతాడు. ఖరీదైన కార్లకు నెంబర్లు కూడా చాలా ఖరీదుగా ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాడో ఏమో గాని ఫ్యాన్సీ నెంబర్లు సెట్ చేసుకోవడంలో అతని తర్వాతే ఎవరైనా అని మరో సారి రుజువైంది. ఇటీవల ఒక ఫ్యాన్సీ నెంబర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా 17 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

NTR Buys Fancy Number For 17 Lakhs | Lamborghini Urus || Filmibeat Telugu
కార్ల విషయంలో అస్సలు తగ్గడు

కార్ల విషయంలో అస్సలు తగ్గడు

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉండాలని అనుకుంటాడు. అలాగే పర్సనల్ లైఫ్లో కూడా అతను ఎంత ఎంత సింపుల్ గా ఉన్నప్పటికీ కూడా లగ్జరీ లైఫ్ విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఆలోచిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కార్లను కొనుగోలు చేసే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఏ మాత్రం తగ్గడు మరోసారి రుజువైంది.

కొత్త కారు ధర ఎంతంటే

కొత్త కారు ధర ఎంతంటే

స్టార్ సెలబ్రిటీలు వారి హోదాకు తగ్గట్టుగా కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్‌ కూడా ఇటీవల లాంబోర్గిని ఉరుస్‌ అనే కారుని కొనుగోలు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ అత్యధికంగా ఖర్చుచేసి లాంబోర్గిని కారును సొంతం చేసుకున్నారు. ఇండియాలో చాలా తక్కువ మంది ఈ కారును కొనుగోలు చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మూడు కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రత్యేకంగా ఇండియాకు తప్పించుకున్నాడు. రీసెంట్ గా కారుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

 17 లక్షలు పెట్టి న్యూ ఫ్యాన్సీ నెంబర్

17 లక్షలు పెట్టి న్యూ ఫ్యాన్సీ నెంబర్

ఇక అంతటి హైక్లాస్ కారుకు ఫ్యాన్సీ నెంబర్ కూడా హై లెవెల్లోనే ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నాడు. అందుకోసం అతను 17 లక్షల వరకు ఖర్చు చేసి అరుదైన ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నాడు. ఇటీవల ఆర్టిఏ ఆధ్వర్యంలో లో కొత్త ఫ్యాన్సీ నెంబర్లు వేలం పాటలో జూనియర్ ఎన్టీఆర్ తన కారు కోసం TS 09 FS 9999 ఆ నెంబర్ ను తీసుకున్నాడు.

గతంలో కూడా ఇదే తరహాలో..

గతంలో కూడా ఇదే తరహాలో..

గతంలో ఇదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సీ నెంబర్ కోసం 10 లక్షల వరకు ఖర్చు చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు తన పాత రికార్డులు జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బ్రేక్ చేశాడు. బడాబాబులు ఎంత పోటీ పడిన కూడా జూనియర్ ఎన్టీఆర్ వారికి ధీటుగా 17 లక్షల వరకు ఖర్చు చేశాడు. ధర ఎంత అయినా పర్వాలేదు అంటూ వేలంపాటలో తన సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

రాబోయే సినిమాలు..

రాబోయే సినిమాలు..

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో చేసినటువంటి RRR సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ తో కూడా ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో మరొక సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో బిజీ కానున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X