జూ ఎన్టీఆర్ కోసం బ్రాండ్ ఆఫ్ కామెడీ తయారుచేసిన శ్రీను...!?
అతి తక్కువ కాలంలోనే అగ్రనిర్మాతగా ఎదిగిని గణేష్ బాబు ప్రస్తుతం మూడు పెద్ద సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేస్తున్న గణేష్ మరో రెండు సినిమాలు ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. పూరి జగన్నాథ్ 'బిజినెస్ మ్యాన్"కి సంబంధించి వర్క్ లో వున్నాడు. సెప్టెంబర్ 1 నుంచి ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది.
'దూకుడు" షూటింగ్ కంప్లీట్ చేసిన శ్రీను వైట్ల, ప్రస్తుతం జూ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ నవంబర్ లోనే స్టార్ట్ అవుతుందట. అందుకు గానూ జూ ఎన్టీఆర్ కోసం బ్రాండ్ ఆఫ్ కామెడీ దర్శకుడు శ్రీనువైట్ల తయారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో బిజీగా వున్న జూ ఎన్టీఆర్ ఈ చిత్రాల తర్వాత పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల డైరెక్ట్ చేయ్యబోయే రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











