మహేష్ తోనే కాదు జూ ఎన్టీఆర్ తో కూడా శ్రీను వైట్ల అదే ‘దూకుడు’..!
ఇటీవల వచ్చిన 'దూకుడు' సినిమా విజయంతో టాలీవుడ్ లో మంచి డిమాండ్ లో వున్న దర్శకుడు శ్రీను వైట్ల, ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాడు. మొదట్లో 'దూకుడు' సినిమాను సల్మాన్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ, సల్మాన్ నుంచి ఈ విషయంలో సరైన స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నానికి స్వస్తి చెప్పి, తెలుగు సినిమా చేయడానికే నిర్ణయించుకున్నాడు.
జూ ఎన్టీఆర్ కథానాయకుడుగా హాస్యనటుడు బండ్ల గణేష్ నిర్మించే చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తాడు. ఈ చిత్రం స్క్రిప్ట్ కు ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్నాడు. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల డైరెక్ట్ చేయబోతున్న జూ ఎన్టీఆర్ సినిమాపై అభిమానుల్లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. శ్రీను వైట్ల తనకీ పెద్ద హిట్ ఇస్తాడని ఎన్టీఆర్ కూడా నమ్ముతున్నాడు. దానికి తగ్గట్టుగానే శ్రీను వైట్ల స్ర్కిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు.
2012 జనవరిలో ఈ సినిమా షూటింగు ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మాఫియా'ఓ మంచి కుటుంబం అనే టైటిల్ అనుకుంటున్నారు. బృందావన్ తర్వాత రెండవసారి జూ ఎన్టీఆర్ కి తమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటించే అవకాశం వుంది.!


Click it and Unblock the Notifications











