వినగానే ఉద్వేగానికి గురి అయ్యా: ఎన్టీఆర్
శ్రీను వైట్ల, నేను కలిసి ఎప్పటినుంచో సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మంచి కథ కుదిరింది. శ్రీను స్టోరీలైన్ చెప్పగానే ఉద్వేగానికి గురయ్యా. మా కాంబినేషన్‌లో అందరి అంచనాలకు ధీటైన సినిమా రాబోతోంది. నిర్మాత బండ్ల గణేష్ భారీ లెవల్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. 'బృందావనం' తరువాత మళ్లీ కాజల్‌తో కలిసి నటించనున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ల తొలిసారి కలిసి ఓ సినిమా చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి వివరాలను మీడియాకు తెలియచేస్తూ ఎన్టీఆర్ ఇలా స్పందించారు. ఇక ఎన్టీఆర్, శ్రీను వైట్ల తొలిసారి కలిసి చేసే సినిమా ఇది.
'దూకుడు'లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీను వైట్ల డెరైక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. ఎన్టీఆర్‌తో ఆమె ఇంతకుముందు 'బృందావనం'లో నటించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మార్చిలో షూటింగ్ మొదలుకానుంది. ఇక దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ -''ఎన్టీఆర్‌తో చేస్తున్న తొలి చిత్రమిది. ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉంటూనే, నా చిత్రాల శైలిలో వినోదాన్ని మిక్స్ చేస్తూ ఈ సినిమా ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం. ఎన్టీఆర్‌ని మరో కొత్త డైమన్షన్‌లో చూస్తారు. మిగిలిన వివరాలు త్వరలో తెలియచేస్తాను'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సమర్పణ: బండ్ల శివబాబు, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











