జూ ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి-ఛత్రపతి ప్రసాద్ కాంబినేషన్ లో టైటిల్ కన్ ఫర్మ్
యంగ్ టైగర్ ఎన్టీార్ 'కిక్" సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో భోగవల్లి బాపినీడు సమర్పణలో ప్రముఖ నిర్మాత ఛత్రపతి ప్రసాద్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి 'ఊసరవెల్లి" టైటిల్ కన్ ఫర్మ్ అయింది.
ఈ సందర్భంగా నిర్మాత బివిఎన్ ప్రసాద్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మా శ్రీవెంకటేశ్వర సినీచిత్రం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బేనర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రానికి 'ఊసరవెల్లి" టైటిల్ ను కన్ ఫర్మ్ చేశాము. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్ ఫుల్ స్టోరీతో, హైటెక్నికల్ వేల్యూస్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీార్ ఫెర్ ఫార్మెన్స్ హైలైట్స్ గా ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
రాబోయే చిత్రాల్లో హై ఎక్స్ పెక్టే షన్స్ వున్న ఈ భారీ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, విదూత్ జామ్వాల్, ఆద్విక్ మహాజన్, పాయల్ ఘోష్, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు తో పాటు మరికొంతమంది నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











