గండిపేటలో జూ ఎన్టీఆర్ తాజా చిత్ర విశేషాలు...!?
జూ ఎన్టీఆర్ హీరోగా మొహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'శక్తి' షూటింగ్ ప్యాచ్ వర్క్ సహా మొత్తం పూర్తయింది. దాంతో ఇప్పడు జూ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం రెగ్యులర్ షూటింగులో పాల్గొంటున్నారు. ఇంతకు ముందే జూ ఎన్టీఆర్ తో 'అశోక్"చిత్రం తీసిన, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నేటి (మార్చి3) నుంచి హైదరాబాదు శివారులోని గండిపేటలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ మార్చి చివరి వరకు షూటింగ్ ఇక్కడే కొనసాగుతుందని సమాచారం. ఎన్టీఆర్ పాల్గొనే కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరోయిన్లు గా తమన్నా, శృతి హాసన్ నటిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిక్ శ్యామ్ ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











