జూ ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి టార్గెట్ అంతా బృందావనమే...!
జూ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే తనకంటూ లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించిపెట్టిన చిత్రం 'బృందావనం". ఎప్పుడూ కత్తులు పట్టుకుని, పెద్ద పెద్ద డైలాగులు చెప్పే జూ ఎన్టీఆర్, 'బృందావనం" చిత్రంలో చాలా సాఫ్ట్ గా కనిపించి అదరగొట్టేశాడు. అయితే ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే..
అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊసరవెల్లి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం స్టిల్స్ చూస్తే, దర్శకుడు సురేందర్ రెడ్డి 'బృందావనం" చిత్రాన్ని ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు గా అనిపిస్తుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ బ్యాగ్ పట్టుకుని వచ్చి 'బృందావనం" చేస్తే, ఈ సినిమాలో ఎన్టీఆర్ బ్యాగ్ తో 'ఊసరవెల్లి"ల వచ్చి అందరిని అదరగొట్టడానికి సిద్దంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదూ....మరి ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్న ఈ హీరో, దర్శకుడికి ఎలాంటి ఫలితం ఉండబోతుందో త్వరలోనే తెలియనుంది.
ప్రస్తుతం ఊసరవెల్లిలోని రెండు పాటల షూటింగ్ కోసం జూ ఎన్టీఆర్, తమన్నా ఫ్రాన్స్ వెళ్లిన విషయం విధితమే. ఫ్రాన్స్ నుండి ఈ నెల 10వ తారీఖున తిరిగి రాగానే సెప్టెంబర్ 12న ఊసరవెల్లి ఆడియో విడుదల చేయుటకు శరవేగంగా సిద్దమౌతోంది.


Click it and Unblock the Notifications











