ట్రెండు ఫాలో అవ్వాలి కదా.... తారక్ కూడా అందులో చేరిపోయాడు!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఇప్పటికే ట్విట్టర్ ఖాతా మెయింటేన్ చేస్తున్న ఈ నందమూరి హీరో ట్రెండ్ ఫాలో అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చేరిపోయారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడకం బాగా పెరిగింది. దీంతో అభిమానులకు టచ్‌లో ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తెరిచిన సంగతి తెలిసిందే.
ఇన్‌స్టాగ్రామ్‌లో తొలి పోస్టుగా తారక్ తన తాజా మూవీ 'అరవింద సమేత వీరరాఘవ' పోస్టర్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్ ప్రధానంగా ఫోటోస్, వీడియోస్ షేరింగ్ ఫ్లాట్‌ఫాం కావడంతో యంగ్ టైగర్ నుండి మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన ఫోటోలు, వీడియోలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న 'అరవింద్ సమేత వీరరాఘవ' సినిమా విషయానికొస్తే.... త్రివిక్రమ్ శ్రీనవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
దీని తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'లో బిజీ కాబోతున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రూ. 200 కోట్లకుపైగా బడ్జెట్‌తో డివివి దానయ్యా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.


Click it and Unblock the Notifications











