కొడుకు కోసం...జూ ఎన్టీఆర్ బ్రేక్ తీసుకున్నాడు!

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగుల నుండి కొంత కాలంగా బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఎన్టీఆర్. సినిమాల బిజీ షెడ్యూల్ వల్ల తన కొడుకుతో సమయం గడపలేక పోతున్నాడు జూ ఎన్టీఆర్. అందుకే ఈ బ్రేక్ తీసుకున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. జులై నెల 22వ తేదీన ఈ దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టిన విషయం తెల్సిందే. ఈ బుల్లి ఎన్టీఆర్‌కు నందమూరి అభయ్‌ రామ్‌ అని పేరు పెట్టారు.

సినిమా విషయానికొస్తే...మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఫైట్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందట. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్ అండ్ ఫైటింగ్ సీన్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట.

Jr NTR takes break for his son

ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X