వాళ్లు జూ ఎన్టీఆర్ తో విడిపోయి మహేష్ బాబుతో కలుస్తున్నారు....
'బృందావనం" ఆడియోతో బిగ్ లీగ్ లోకి ఎంటరయ్యానని 'కిక్" మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆనందాన్ని పట్టలేకపోతున్నాడు. 'బాయ్స్" బృందంలో ఒకడిగా, మణిశర్మ ప్రియ శిష్యుడిగా కెరీర్ ఆరంభించిన థమన్ మొదట్టో 'బీభత్సం" వంటి సినిమాలకు పని చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. అయితే 'కిక్"తో బ్రేక్ లభించడంతో తమన్ దశ తిరిగింది. పైడిపల్లి వంశీ రికమెండేషన్ తో జూ ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ చేసే ఛాన్స్ రావడంతో థమన్ ఆశిస్తున్న ఆ బిగ్ బ్రేక్ రానే వచ్చింది. 'బృందానవం" కి మ్యూజిక్ చేస్తున్నాడనగానే పెద్ద హీరోల దృష్టి థమన్ పై పడింది. శ్రీనువైట్లకి థమన్ మ్యూజిక్ తెగ నచ్చేయడంతో మహేష్ తో చేస్తున్న 'దూకుడు"కి అతడిని రికమెండ్ చేసాడు. మహేష్ ఓకే చెయ్యడంతో థమన్ 'దూకుడు" షురూ అయింది.
కాగా 'బృందావనం"లో విడిపోయి 'దూకుడు"లో కలుసుకుంటోన్న వాళ్లు ఇంకా ఉన్నారు. 'బృందావనం" లో కీ రోలో ప్లే చేసిన ప్రకాష్ రాజ్ 'దూకుడు" లోనూ కీలక పాత్ర చేయబోతున్నాడు. ఇలా ఇక్కడి నుండి అక్కడికి దూకి 'దూకుడు" టైటిల్ ని జస్టిఫై చేసేశారు. అయితే ఎన్టీఆర్ నుండి మహేష్ కి షిఫ్ట్ అవుతోన్నవారిలో మెహర్ రమేష్ కూడా జాయిన్ అవుతున్నాడు. 'శక్తి" కాగానే అతను మహేష్ సినిమా పనిలో బిజీ అవుతాడు. ఇలా ఎన్టీఆర్ మేళమంతా మహేష్ మీదకు దూకుతుంటే, శ్రీనువైట్ల మాత్రం ముందు మహేష్ దూకుడు పూర్తి చేసి తర్వాత ఎన్టీఆర్ మీదకు దూకుతానంటున్నాడు..


Click it and Unblock the Notifications











