ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్: తన ఫ్యామిలీ పరిస్థితిని వివరిస్తూ ట్వీట్.. దానికి ముందే ఇలా జరగడంతో!

నందమూరి తారక రామారావు మనవడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న అతడు.. మధ్యలో ఫ్లాపులను చవి చూశాడు. ఇక, కొన్నేళ్లుగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తారక్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు. ఆ వివరాలు మీకోసం!

డబుల్ హ్యాట్రిక్ చేయబోతున్న ఎన్టీఆర్

డబుల్ హ్యాట్రిక్ చేయబోతున్న ఎన్టీఆర్

కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. దీనికి కారణం అతడు వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతుండడమే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి మొదలుకొని 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుని డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నాడు.

చరిత్రలోనే భారీ చిత్రంలో యంగ్ టైగర్

చరిత్రలోనే భారీ చిత్రంలో యంగ్ టైగర్

తెలుగు సినీ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతోన్న మూవీ RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. దీన్ని డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, ఎన్టీఆర్.. కొమరం భీంలా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లు.

30వ సినిమాను ప్రకటించిన జూనియర్

30వ సినిమాను ప్రకటించిన జూనియర్

ఎన్టీఆర్ 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేయాలని భావించాడు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. కానీ, ఊహించని విధంగా దీన్ని కొరటాల శివతో చేస్తున్నాడు. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో మూవీ వస్తుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతుంది.

అలా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు

అలా బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు

సినిమాల పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ అనే షోకు హోస్టుగా చేసిన విషయం తెలిసిందే. యాంకర్‌గా మొదటి ప్రయత్నమే అయినా.. దీన్ని విజయవంతంగా నడిపించాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షో ద్వారా టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఈ షో ప్రారంభం కాబోతుంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సారి దీని ప్రభావం సినిమా రంగంపై ఎక్కువగా చూపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఈ వైరస్ సోకింది. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపాడు.

తన ఫ్యామిలీ పరిస్థితిని వివరిస్తూ ట్వీట్

తన ఫ్యామిలీ పరిస్థితిని వివరిస్తూ ట్వీట్

జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో 'నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నేను బాగానే ఉన్నాను.. దయచేసి మీరెవరూ బాధ పడకండి. నాతో పాటు నా కుటుంబ సభ్యులు కూడా ఎవరికి వారే ఐసోలేషన్‌లో ఉన్నాము. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నాము. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోండి' అంటూ వెల్లడించాడు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
స్పెషల్ డే‌కు ముందే ఇలా జరగడంతో

స్పెషల్ డే‌కు ముందే ఇలా జరగడంతో


జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న జరగనుంది. ఇందుకోసం అతడి అభిమానులు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నెల రోజుల కౌంట్‌డౌన్‌కు సంబంధించిన ట్రెండ్‌ను క్రియేట్ చేసిన వాళ్లంతా.. పుట్టినరోజున సోషల్ మీడియాలో రచ్చ చేయాలని సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X