జూ ఎన్టీఆర్ అభిమానులకు దీపావళి గిఫ్ట్ అదే?

By Bojja Kumar

హైదరాబాద్: జూ ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీపావళికి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు దీపావళి పండగ కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పోలీసాఫీసర్ పాత్రలో కనపడబోతున్నారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ బేగంపేటలో పోలీస్ స్టేషన్ సెట్ వేసారు. దీని కోసం నిర్మాత బండ్ల గణేష్ రూ. 27 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

Jr NTR to arrive for Diwali?

యాక్షన్ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఆలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బండ్ల గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కెనిడయన్ మోడల్ అయిన నోరా ఫటేహి ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తూండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్‌, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X