ఎన్టీఆర్‌ ఏం మాట్లాడతాడు?

By Staff

Jr Ntr
రేపటినుంచి ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానున్న ఎన్టీఆర్ రోడ్ షో లో ఏం మాట్లాడతాడు..ఏయే అంశాలు ప్రస్ధావన తెచ్చి ప్రజలను,అభిమానులను ఆకట్టుకుంటాడు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్టీఆర్ ఇచ్చే స్పీచ్ లు ఓ స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారని సమాచారం. నారా లోకేష్ దగ్గరుండి..ప్రసంగాల ప్రతులును తయారు చేయించారని అంటున్నారు. ఆ స్పీచ్ లో ప్రజలను కొన్ని ప్రశ్నలు అడుగి..ఆన్సర్స్ గా తెలుగుదేశం ప్రగతిని చెప్పించాలనుకుంటున్నారు.

పేదలకు, కార్మికులకు, కర్షకులకు తెలుగుదేశం చేసింది ఏమిటీ? ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ఇచ్చింది ఎవరు? పేదలకు రెండు రూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేదం విధించింది ఎవరు అనే విష యాలను ప్రజలకు చెప్పే విధంగా ప్రసంగం సాగుతుంది. అలాగే బీసీలను ఆదరించింది ఎవరు? సామాజిక న్యాయం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డు జరిగిందనే విషయాలనుఎన్టీఆర్ ఈ సందర్బంగా ప్రజల దృష్టికి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పనిలో పనిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన అవినీతి, ప్రజారాజ్యం పార్టీ విధానాలపై స్పష్టత లేకపోవటం ఎన్టీఆర్ వినర్శించే అవకా శాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చేసిన అభివృద్ధి పైనే కాన్సర్టేట్ చేస్తున్నారని, కొత్త హామీలు ఉండవని సమాచారం. హరికృష్ణ, నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ తో పాటు రొడ్ షో లో పాల్గొనే అవకాశముంది. తారకరత్న, కల్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్ రోడ్ షో లో కొన్ని ఏరియాల్లో పాల్గొంటారు. ఇక ఎన్టీఆర్ తన తాతగారి మాటతీరునే కాక, ఖాఖీ డ్రెస్ ని సైతం అనుకరించి, ఆ పెద్దాయనని గుర్తు చేస్తారనే సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X