»   » చిన్నారి అభిమానికి క్యాన్సర్: పరామర్శించిన జూ ఎన్టీఆర్ (ఫోటో)

చిన్నారి అభిమానికి క్యాన్సర్: పరామర్శించిన జూ ఎన్టీఆర్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానిని మంగళవారం కలిసి పరామర్శించారు. ఆ అభిమాని పేరు శ్రీనిధి. వయసు పదేళ్లు. జూ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే శ్రీనిధి అతని చూడాలని కోరుకోవడంతో ఆమె కోరిక తీర్చేందుకు ఎన్టీఆర్ వచ్చాడు. ఆమె కోసం బహుమతులు తెచ్చాడు. 

Jr NTR to meet his fan

శ్రీనిధిని కలిసిన ఎన్టీఆర్ ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఏం చదువుతున్నావ్ అంటే ఐదో క్లాస్ పూర్తయ్యింది అని చెప్పింది. నా సినిమాలు ఏమేం చూశావ్? అని ఎన్టీఆర్ అడగ్గా.. అన్నీ చూశా అని తెలిపింది. ఏ సినిమా అంటే ఇష్టం అనడిగితే..'యమదొంగ' పేరు చెప్పింది శ్రీనిధి. నా డాన్సులు ఇష్టమా? ఫైట్సా అని ఎన్టీఆర్ అడగ్గా.. డ్యాన్స్ అంటే ఇష్టం... అని శ్రీనిధి పేర్కొంది. 

హైదరాబాద్ కూకట్ పల్లిలోని రాందేవ్ ఆసుపత్రిలో శ్రీనిధి చికిత్స పొందుతోంది. ఆమెకు క్యాన్సర్ ఫోర్త్ స్టేజీలో ఉంది. జూ ఎన్టీఆర్ వస్తుండటంతో రాందేవ్ ఆసుపత్రి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. భర్త ఏర్పాట్లు కూడా భారీగా చేసారు. 

Jr NTR to meet his fan suffering with cancer

వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనిధి తండ్రి గవర్నమెంటు చిరుద్యోగి. కూతురు చికిత్స కోసం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నారు. తన కూతురు కోరికను తీర్చేందుకు సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నారు. మొత్తానికి శ్రీనిధి విషయం ఎన్టీఆర్ కు చేరడంతో ఆయన స్పందించారు.

English summary
Srinidhi, a 10 year old girl, is suffering with cancer and the girl's wish is to meet her favourite hero NTR. NTR, who came to know about this through Make A Wish Foundation, is going to meet the girl today (May 12th).
Please Wait while comments are loading...