WAR 2: బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్.. ఆ పాన్ ఇండియా స్టార్‌తో మల్టీస్టారర్.. తొలి హీరోగా సంచలన రికార్డు

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో కాస్త ఇబ్బంది పడినా 'టెంపర్'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఈ స్టార్ హీరో.. అప్పటి నుంచి వరుసగా విజయాలను అందుకుంటోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ వివరాలు మీకోసమే!

అంతర్జాతీయ స్థాయికి తారక్

అంతర్జాతీయ స్థాయికి తారక్

వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. అంతేకాదు, దీనితో అతడి రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరింది.

కొరటాల శివతో తారక్ మూవీ

కొరటాల శివతో తారక్ మూవీ

RRR చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ మొత్తం పూర్తి అయింది. ఈ చిత్రం షూటింగ్‌ను ఇటీవలే ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టేశారు.

ప్రశాంత్ నీల్‌తోనూ ప్రాజెక్టు

ప్రశాంత్ నీల్‌తోనూ ప్రాజెక్టు

RRR సక్సెస్‌తో మరింత జోష్‌తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతుంది. దీనిపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఎంతో మంది దర్శకులతో

ఎంతో మంది దర్శకులతో

ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు కమిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు మరికొందరితోనూ కథాపరమైన చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి పేరు మారుమ్రోగిపోతోంది.

బాలీవుడ్‌లోకి తారక్ ఎంట్రీ

బాలీవుడ్‌లోకి తారక్ ఎంట్రీ

ఒకటి పట్టాలపై ఉండగానే మరికొన్ని సినిమాలను ఓకే చేసుకుంటోన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ అధికారికంగా బయటకు వచ్చింది. అంతేకాదు, అతడు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు కూడా అధికారికంగా తెలిపాయి.

ఆ బడా హీరోతో మల్టీస్టారర్

ఆ బడా హీరోతో మల్టీస్టారర్

RRRతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ సిరీస్‌గా వచ్చిన 'వార్' సీక్వెల్‌లో నటించబోతున్నాడు. 'వార్ 2' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో తారక్.. బాలీవుడ్ బడా హీరో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నట్లు తాజాగా తెలిసింది.

మొట్టమొదటి హీరోగా రికార్డ్

మొట్టమొదటి హీరోగా రికార్డ్

యశ్ రాజ్ ఫిల్మ్స్ ఇండియాలోనే బడా ప్రొడక్షన్ హౌస్‌గా వెలుగొందుతోంది. ఇందులో సినిమాలు చేయాలని ఎంతో మంది స్టార్లు భావిస్తుంటారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్‌కు అదే సంస్థ నుంచి పిలువు వచ్చింది. 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీంతో దక్షిణాది నుంచి ఆ సంస్థలో సినిమా చేస్తోన్న మొట్టమొదటి హీరోగా ఎన్టీఆర్ సంచలన రికార్డును నమోదు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X