తమిళ్ స్టార్ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా: ఎవరంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. మరో కీలక ప్రాజెక్టును ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీతో యంగ్ టైగర్ ఓ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం.

తమిళ్ స్టార్ డైరెక్టర్‌తో..
తమిళ చిత్ర సీమలో అట్లీ విజయవంతమైన డైరెక్టర్‌గా ఉన్నారు. అట్లీతో తీసే సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్‌తో జూనియర్ ఎన్టీఆర్, తన సినిమాతో అట్లీ బిజీగా ఉండటంతో ఈ కొత్త ప్రాజెక్టుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

‘బిగిల్’తో అట్లీ బిజీ..
తమిళ స్టార్ హీరో, విజయ్‌తో ‘బిగిల్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు అట్లీ. ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటిస్తోంది. ‘దళపతి' విజయ్ ఈ చిత్రంలో సాకర్ కోచ్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత అట్లీ.. జూనియర్ ఎన్టీఆర్‌తో తన సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్‌తో ఎన్టీఆర్ బిజీ..
ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం 2020లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్‌తో ‘మసాలా’
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ చిత్రంలో ఓ నాయికగా నటిస్తోంది. అలియా భట్‌కి ఇది టాలీవుడ్‌లో తొలి సినిమా. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత త్రివిక్రమ్ రూపొందించే ‘మసాలా' చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ చిత్రం తర్వాత లేదా అదే సమయంలో ఎన్టీఆర్.. అట్లీ సినిమాలో నటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











