టాలీవుడ్ బెస్ట్ డాన్సర్ ఎన్టీఆర్
టాలీవుడ్ లో ఇప్పుడున్న కుర్ర హీరోల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎంత మంచి డాన్సర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ కొత్త స్టెప్ తో ప్రేక్షకులు ముందుకు రావాలని ప్రయత్నిస్తుంటారు వీరు. 'యమదొంగ'లో ఎన్టీఆర్ అదుర్స్ అనిపించుకుంటే, 'మగధీర'లో రామ్ చరణ్ డాన్స్ 'ధీర' అనిపించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా హ్యాపీ, దేశముదురు వంటి చిత్రాల్లో తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు.
మరి ఈ ముగ్గురిలో ఎవరు ది బెస్ట్ అంటే సగానికి సగం మంది ఎన్టీఆరే ఉత్తమ డాన్సర్ అని అభిప్రాయపడ్డారు. ఇదెవరి అభిప్రాయమో కాదు సాక్షాత్తు తెలుగు ప్రేక్షకుడిది. మన దట్స్ తెలుగు సైట్ లో ఎవరు ఉత్తమ డాన్సర్ అని నిర్వహించిన పోల్ లో ఎన్టీఆర్ 52.06% పోల్స్ తో అగ్రస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో 30.84% పోల్స్ తో రామ్ చరణ్, 17.1% పోల్స్ తో అల్లు అర్జున్ నిలిచారు.


Click it and Unblock the Notifications











