జూ ఎన్టీఆర్ వాళ్ళకు టార్చర్ పెడుతున్నాడా?
అల్లు అర్జున్ బద్రీనాధ్ చిత్రం ప్లాప్ అయినా డాన్స్ లతో అదరకొట్టాడని పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు పరిశ్రమలో నెంబర్ వన్ డాన్సర్ ఎవరన్నది హాట్ టాపిక్ గా మారింది. జూ ఎన్టీఆర్ ఇన్నాళ్లూ తనే నెంబర్ వన్ డాన్సర్ అనిపించుకున్నాడు.దాంతో ఇప్పుడు ఆ స్ధానం వేరే వారికి వెళ్ళేటట్లు ఉందని తన కొరియోగ్రాఫర్స్ ని ఓ రేంజిలో టార్చర్ పెడుతున్నట్లు సమాచారం. కొత్త స్టెప్స్, వెరైటీగా ఉండేవి కావాలని,వారు ఏ స్టెప్ వేసినా ఇంకా బాగా ఉండాలని ఆదేశిస్తునున్నట్లు సమాచారం. దాంతో వారు తమలో క్రియోటివిటి అనేది కిల్ అయిపోతోందని గోల పెడుతున్నారుట. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్..దీనికి ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్...సురేంద్ర రెడ్డి,బోయపాటి శ్రీను ల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











