'అన్న' పేరు ఎన్టీఆర్ ఒక్కరిదే: జూ.ఎన్టీఆర్
విజయవాడ : తెలుగు ప్రజల హృదయాల్లో 'అన్న' అనే పేరు దివంగత ఎన్టీ రామారావుకే ఉందని.. చరిత్ర ఉన్నంతవరకు ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. శనివారం విజయవాడలో మలబార్ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 'బెజవాడ' అనే పదంలో ఉన్న దమ్ము 'విజయవాడ'లో ఉండదన్నారు. ఆయన అన్న ఈ మాటలు ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.
అలాగే ...బెజవాడ ప్రజలు తనపై చూపించిన అభిమానం వెలకట్టలేనిదని చెప్పారు. మలబార్ డైమండ్స్ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి రావడం, ఇక్కడి ప్రజల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చూస్తుంటే సినిమా శతదినోత్సవాలు నిర్వహించినట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆజన్మాంతం తాను బెజవాడను మరువలేనని తెలిపారు. మళ్లీ బాద్‌షా సినిమా సక్సెస్ తర్వాత నగరానికి వస్తానని అభిమానులకు హామీ ఇచ్చారు.
బాద్షా చిత్రం విషయానికి వస్తే.. ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే రోజు ఉదయం 5.23 నిముషాలకు విడుదల ముహూర్తం ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇందుకోసం నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేకంగా పండితులను కలిసి ముహూర్తం పెట్టించారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ హెయిర్‌స్టయిల్ నుంచి పెట్టుకున్న వాచ్, మాట్లాడే ప్రతి మాటా.. ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. బ్రాండెడ్ వేర్‌లో 'లిమిటెడ్ ఎడిషన్' అంటారే... అలా ఈ 'బాద్‌షా' ఓ 'స్పెషల్ పీస్'లాంటిది. ఆరంభం నుంచి శుభం వరకు శ్రీను వైట్ల ఎంతో శ్రద్ధ తీసుకుని చేశారు. మేమందరం గర్వంగా చెప్పుకునే చిత్రం అవుతుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











