ప్రసాద్ ల్యాబ్స్‌లో జూ ఎన్టీఆర్-త్రిష ఏం చేస్తున్నారు?

By Bojja Kumar

జూ ఎన్టీఆర్-త్రిష జంటగా 'దమ్ము' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరుగుతోంది. జూ ఎన్టీఆర్, త్రిష, ఇతర సహాయ నటులపై పలు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ చిత్రీకరణ పూర్తయిన తర్వాత మరో వారంలో రెండు పాటల చిత్రీకరణ, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

బోయపాటి శ్రీను దర్శకత్వం‌లో రూపొందుతున్న 'దమ్ము' చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. త్రిష, కార్తీక ఆ రెండు పాత్రల సరసన హీరోయిన్లు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కె.ఎస్. రామారావు ఈ చిత్రాన్ని సమర్పకులు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మార్చి 24వ తేదీన ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

యాక్షన్ అండ్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అలెగ్జాండర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రేజీ హీరో ఎన్టీఆర్ కావడంతో దర్శకుడు బోయపాటి అతని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ విషయంలో ప్రత్యేక శద్ద తీసుకుంటున్నారు. ఇప్పటికే బయటకు లీకైన దమ్ము డైలాగులకు అభిమానులను మంచి రెస్పాన్స్ వస్తోంది కూడా. ఈ చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X