జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం ఖరారు, డీటేల్స్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమా కన్‌ఫర్మ్ అయింది. 'దమ్ము' చిత్రం తర్వాత నిర్మాత కె.ఎస్ రామారావు మరో సినిమాకు కూడా జూ ఎన్టీఆర్‌తో సైన్ చేయించుకున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈచిత్రాన్ని ఆయన త్రివిక్రమ్ చేతుల్లో పెట్టినట్లు సమాచారం. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ జూనియర్‌ను తనదైన డిఫరెంట్ స్టయిల్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో ఓ టీవీ యాడ్ రూపొందబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ నవరత్న్ కూల్ టాల్క్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వేసవికిగాను కొత్త యాడ్ చిత్రీకరిస్తున్నారు. ఈ యాడ్‌కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఈ యాడ్‌ను రాజమౌళి దర్శకత్వంలో రూపొందించారు. యాడ్ ఫిల్మ్ రూపొందించడంలో త్రివిక్రమ్‌కు మంచి అనుభవం ఉంది. రామ్ చరణ్, ధోనీలతో రూపొందించిన థమ్సప్ యాడ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్రిష, కార్తీకలు హీరోయిన్లుగా అలెగ్జాండర్ వల్లభ నిర్మించిన 'దమ్ము' విడుదలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 16కల్లా చిత్రం ఫస్ట్ కాపీ రెడీ కాబోతోంది. 20వ తేదీకల్లా సెన్సార్ పూర్తి చేసుకుని...ఏప్రిల్ 27న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్...అల్జు అర్జున్-ఇలియానా జంటగా డివివి దానయ్య నిర్మాణ సారథ్యంలో 'జులాయి' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అదిరిపోయే డైలాగులు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో సాగే త్రివిక్రమ్ సినిమాలంటే ఇష్టపడనివారు ఉండరు. అందులోనూ జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











